డ్రామా ఆడింది.. ప్రాణం తీసుకుంది..

    0
    1484

    పరువు తక్కువని భావించిందో, లేక కుటుంబం పరువు మంటగలిపానని పశ్చాత్తాప పడిందో తెలియదు కానీ కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్ కేసర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తననెవరో కిడ్నాప్ చేశారని, పోలీస్ అంకుల్ కాపాడండి, నన్ను రేప్ చేస్తున్నారు.. అంటూ డైలాగులు కొట్టి పోలీసుల్నే తప్పుదోవ పట్టించిన ఫార్మసీ విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కిడ్నాప్‌ నాటకమాడిందిలా…
    నలుగురు వ్యక్తులు తనని అపహరించి, సామూహిక అత్యాచారం చేశారంటూ కీసరకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కొన్నిరోజుల క్రితం పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. సకాలంలో రియాక్ట్ అయిన పోలీసులు ఆమె ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఆ తర్వాత అసలు విషయంపై ఆరా తీయగా.. అదంతా కట్టుకథ అని తేలింది. ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో తిరిగానని, ఆ సమయంలో తల్లి భయపెట్టడంతో అత్యాచారం అనే నాటకాన్ని అమలుచేశానని బాధితురాలు అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు.

    అసలా రోజు ఏం జరిగింది..?
    ‘తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారంటూ ఫార్మసీ విద్యార్థిని బంధువులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వేగేట్‌కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించారు. కాలికి గాయాలై నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇబ్బందిపెట్టకుండా సీన్‌ రీ-కన్‌ స్ట్రక్షన్‌కు దర్యాప్తు బృందం ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలో కిడ్నాప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్‌ ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా బృందంలోని ఓ సీఐ తెలుసుకున్నారు. అప్పటికే అదుపులో ఉన్న అతన్ని మరోసారి సీఐ ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్‌ఎల్‌నగర్‌లో దిగలేదని, వేరే స్టాప్‌లో దిగిందని అతను చెప్పాడు. ఆటోలోనుంచి దిగిన తర్వాత సినిమాకు వెళ్లి తర్వాత మద్యంతాగి ఇంటికెళ్లినట్టు వివరించాడు. అతను చెప్పిన వివరాలన్నీ నిజమేనని నిర్ధారణకు వచ్చాక దర్యాప్తు అధికారులు రివర్స్‌ ఇన్వెస్టిగేషన్‌ను ప్రయోగించారు. అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్ ‌స్టాప్‌ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వద్దకు వెళ్లిన పోలీసులు నిజం చెప్పమని నిలదీశారు. ఆ తర్వాతి రోజు ఆస్పత్రి నుంచి నేరుగా రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చిన యువతి, తాను చెప్పిందంతా అబద్ధమని పోలీసుల ముందు అంగీకరించింది. ఈ వ్యవహారంలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి సంబంధంలేదన్న పోలీసులు వారిని క్షమాపణ కూడా అడిగారు.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?