పెళ్లిమండపంలోకి ఎంట్రీ ఇలా ఉండాలనుకున్నారు..

  0
  38934

  వెరైటీ ఎంట్రీ.. కొత్త జంటకు చేదు అనుభవం.. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎంట్రీ ఘనంగా ఉండాలని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో ఓ పెళ్లి వేడుకలో క్రేన్ ప్రమాదంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గాయపడ్డారు. పెళ్లి వేడుకలో వెరైటీ ఎంట్రీ ఇచ్చేందుకు ఓ ప్రైవేటు సంస్థ ఈ తతంగాన్ని నడిపింది.

  వెడ్డింగ్ ప్లానర్లు ఓ రింగ్ లాంటి వస్తువులో కొత్త జంట ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. అయితే ఈ వ్యవహారం పూర్తిగా రివర్స్ అయింది. సరిగ్గా చిచ్చుబుడ్లు వెలిగి.. అంతా బాగుందనుకున్న టైమ్ లో ఆ రింగ్ ని మోస్తన్న క్రేన్ ఫెయిలైంది. దీంతో ఇనుప తీగ తెగి పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు రింగ్ లోనుంచి కిందపడ్డారు. వారిగి గాయాలయ్యాయి. అయితే దీన్ని అశుభంగా భావించక.. ఫస్ట్ ఎయిడ్ చేసి, వారిద్దరికీ పెళ్లి చేశారు పెద్దలు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.