ఆర్.ఆర్.ఆర్ మానియా ప్రపంచవ్యాప్తమైంది. రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా అనిపించిన ఈ చిత్రం… విడుదలయ్యాక తొలిరోజే బాక్సాఫీస్ కుంభస్థలాన్నే కొట్టేసింది. ఈ సినిమాలో చరణ్ .. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా కనిపించి ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకుంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి కధ కావడంతో అప్పటి కట్టడాలను కళాత్మకంగా తెరకెక్కించాడు దర్శక ధీరుడు రాజమౌళి. చరణ్ ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ కనిపించగా, తారక్ మాత్రం బైక్ రైడ్ చేస్తూ అలరించాడు.
ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్రిటీష్ కాలంలో వాడే బైక్ కోసం జక్కన్న తీవ్రంగా శ్రమించాడు. అయితే ఆ తరహా బైక్ లు లభించకపోవడంతో ప్రత్యేకంగా తయారు చేయించాడట. అప్పట్లో వెలా సెట్ బైక్ ట్రెండింగ్ లో ఉండేదట. ఆ మోడల్ బైక్ నే స్పెష్టల్ డిజైన్ చేయించాడట. ఈ బైక్ తయారీ కోసం 20 లక్షలు ఖర్చు చేశారట. మొత్తానికి ఈ బైక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
అసలు వెలిసెట్ బైక్ చరిత్ర ఇదీ..
===============///
1904 సంవత్సరంలో వెలా సెట్ బైక్ మోడల్స్ ఉండేవి. అప్పట్లో అంతర్జాతీయంగా ఫేమస్ పొందిన మోటార్ సైకిల్. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్‌లో ఒక కుటుంబంల ఈ మోటార్ సైకిల్ తయారు చేసేంది. అందరూ ఊహిస్తున్నట్లు అది పెద్ద ఫ్యాక్టరీ కాదు. చేతితో దాన్ని తయారు చేసేవాళ్ళు. 1920 నుంచి 1950 వరకు రేస్ బైక్ లు కూడా తయారు చేసేవాళ్ళు. దీనికి వరల్డ్ చాంపియన్ షిప్ టైటిళ్ళు కూడా వచ్చాయి. సింగిల్ సిలిండర్ 500 సీసీ. వంద మైళ్ళ గరిష్ట వేగం ఉండేది. 1960 నాటికి వ్యాపారం తగ్గి 1971లో వాటి తయారీ నిలిపి వేశారు. జాన్ గుడ్ మెన్, యుజెన్ గుడ్ మెన్, పెర్సీ గుడ్ మెన్, పీటర్ గుడ్ మెన్. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఆ బైక్ తయారీలకు వీరే యజమానులు.