వామ్మో , రామ్ చ‌ర‌ణ్ అల్లూరి గెటప్ లో ఇంతమందా..??

  0
  84

  మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ ఆర్.ఆర్.ఆర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కావ‌డంతో ఇద్ద‌రి ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగిపోయారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తీసిన ఆర్.ఆర్.ఆర్ మూవీకి అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అభిమానుల అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ సినిమా తెర‌కెక్కించాడు జ‌క్క‌న్న‌. ఇద్ద‌రి హీరోల ఫ‌స్ట్ పోస్ట‌ర్ మొద‌లుకొని, టీజ‌ర్, ట్రైల‌ర్ రిలీజ్ వ‌ర‌కు ఒక్కొక్క‌టి ఒక్కో హైలెట్ గా నిలిచింది. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఘ‌నంగా జ‌రిగింది.

  ఆర్.ఆర్.ఆర్ చిత్ర విడుద‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక తీరేలా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ఈ చిత్రం విడుద‌లైంది. చ‌ర‌ణ్, తార‌క్ లు ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే చరణ్ సినిమాలో పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రని చరణ్ ఫ్యాన్స్ ఫాలో అయ్యారు. హైద‌రాబాద్‌లో 100 మందికి పైగా అభిమానులు అల్లూరి సీతారామరాజు గెటప్ ను ధరించారు. అదే గెటప్ లో భారీగా బైక్ ర్యాలీ చేశారు.

  జంట‌న‌గ‌రాల్లో చక్కర్లు కొడుతూ సంద‌డి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన అభిమానులు అల్లూరి గెట‌ప్ లో బైక్ ల‌పై ర్యాలీగా హైద‌రాబాద్ వ‌చ్చిన దృశ్యాలు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు. వంద‌ల మంది ఒకేసారి అల్లూరి గెట‌ప్ లో సంద‌డి చేయ‌డం సెన్సేష‌న్ గా మారింది. అదీగాకుండా రిలీజైన ప్ర‌తి థియేట‌ర్ వ‌ద్ద అభిమానులు టెంకాయ‌లు కొట్టారు. క‌టౌట్ల‌కు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఒక‌టా రెండా.. ఇలా ఎన్నెన్నో ర‌కాలుగా హంగామా చేశారు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..