భార్య కోసం ఓ భర్త సాహసం.. ప్రాణాలే పణంగా పెట్టి..

  0
  104

  క‌రోనా క‌ల్లోలంలో భార్య నుంచి విడిపోయిన ఓ భ‌ర్త ఆమెను చేరుకునేందుకు చేసిన సాహ‌సం నిజంగా చాలా గొప్ప‌ది. థాయ్ ల్యాండ్ నుంచి ఓ వ్య‌క్తి ర‌బ్బ‌ర్ బోట్ లో ముంబైలోని త‌న భార్య‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చాడంటే.. నిజంగా ఆ భ‌ర్త ప్రేమ వ‌ర్ణించ‌లేనిది. రెండేళ్ళ క్రితం క‌రోనా స‌మ‌యంలో వియాత్నాంకు చెందిన హోహంగ్ అనే వ్య‌క్తి భార్య నుంచి విడిపోయాడు. భార్య ముంబైలో ఉంది. అత‌డేమో వియత్నాంలో ఉన్నాడు. ఎలాగైనా భార్య‌ను క‌లుసుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేశాడు.

  వ‌చ్చేందుకు విమానం ఎక్కేందుకు డ‌బ్బులు లేవు. వీసాకూడా రాలేదు. దీంతో 37 ఏళ్ళ హోహంగ్ థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ చేరుకున్నాడు. అక్కడినుంచి పుకెట్ వ‌ర‌కు బ‌స్సులో వెళ్ళి అక్క‌డి నుంచి తేలే ర‌బ్బ‌ర్ డింగీ ఒక‌టి తీసుకుని మ్యాప్ గానీ, కంపాస్ గానీ లేకుండా నీళ్ళ క్యాన్‌లు పెట్టుకుని ప్ర‌యాణం మొద‌లుపెట్టాడు. దిక్కు దిశ‌లు తెలియ‌ని స‌ముద్రంలో ముంబైలో ఉండే భార్య‌ను క‌లుసుకునేందుకు ర‌బ్బ‌రు డింగీలో బ‌య‌లుదేరిన హోహంగ్ నిజంగా గొప్ప‌వాడే.

  ఇత‌డిని థాయ్ ల్యాండ్ స‌ముద్ర క‌మాండ్ ద‌ళం ప‌ట్టుకుని అత‌డి ప్ర‌యాణం గురించి తెలుసుకుని ఆశ్చ‌ర్యపోయింది. అయితే స‌రైన ప‌త్రాలు లేకుండా స‌ముద్రంలో ప్ర‌యాణిస్తున్న హోహంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. థాయ్ ల్యాండ్ పోలీసులు కూడా భార్య ప‌ట్ల ఉన్న అత‌ని ప్రేమ‌కు ముగ్ధులయ్యారు. తుఫాన్ వ‌చ్చేలోగా స‌ముద్రంలో ప్ర‌యాణించి ముంబ చేరుకుని త‌న భార్య‌ను క‌లుసుకోవాల‌న్న‌దే త‌న కోరిక‌ని చెబుతుండ‌డం విశేషం.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..