16 కోట్లు ఇంజెక్షన్ ఇచ్చినా , ప్రాణం పోయింది.

  0
  729

  ప్రపంచం మొత్తం ఆ పాప బ్రతకాలని కోరుకుంది.. పాప విషయం తెలిసిన మనసున్న ప్రతిఒక్కరూ ఏంతో కొంత దానం చేశారు.. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ తెప్పించి వేశారు.. ఇంతమంది ఆశీస్సులు , తల్లితండ్రుల ప్రార్థనలు .. విధి ముందు ఓడిపోయాయి.. పాప చనిపోయింది.. అందరి ఆశలపై నీళ్లు చల్లి మృత్యు ఒడికి చేరుకుంది.. వేదికషిండే అనే పూణెకి చెందిన ఏడాది వయసున్న ఈ పాప అరుదైన టైప్ – 1 ఎస్ ఎం ఏ అనే జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతొంది. ఆ పాపకు ఈ వ్యాధి నయంచేసేందుకు 16 కోట్లు విలువచేసే జొల్ గోస్మా అనే వ్యాక్సిన్ ఇవ్వాలి. ఈ విషయం గురించి తల్లితండ్రులు సోషల్ మీడియాలో , తమ పరిస్థితి వివరించి , సాయంకోసం అర్దించారు.. కొద్దికాలంలోనే 16 కోట్లు వసూలైంది..అమెరికానుంచి ఇంజెక్షన్ తెప్పించి వేశారు.. అంతా బాగుంది అనుకున్న తరుణంలో ఆ పాప ఆదివారం మృత్యువాత పడింది.. కన్నవారికి శోకం మిగిల్చింది..పాపకు ఆదివారం ఉదయమే ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో హాస్పిటల్ కి తీసుకొచ్చారు.. అప్పటికే పరిస్థితి విషమించింది.. అయినా డాక్టర్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. వాళ్ల చేతుల్లోనే పాప ప్రాణం విడిచింది.. తల్లితండ్రులేకాదు , హాస్పిటల్ సిబ్బందికూడా కన్నీరు పెట్టింది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?