గని ఫ్లాప్ నాకు ఒక పాఠం.. ఒప్పుకున్న వరుణ్ తేజ్..

    0
    385

    గని సినిమా ఫ్లాప్ కావడంతో వరుణ్ తేజ్ ఆలోచనలో పడినట్లు ఉన్నాడు . మొదట్లో ఫిదా , తొలిప్రేమ లాంటి లవ్ స్టోరీలతో మంచి హిట్స్ కొట్టేశాడు. ఒక యాక్షన్ ఫిలిం గని తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిరంజీవి కూడా ఒక ప్రత్యేకమైన సందేశంతో అభిమానులకు ఈ సినిమాలో వరుణ్ తేజ్ ను ఆశీర్వదించమని కోరారు. గని సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్ వర్క్ బాగానే చేసుకున్నట్టు కనపడింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత దానికి ముందు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలను తలకిందులు అయిపోయాయి.

    మెగా ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ హీరోల నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఇంత దారుణంగా ఫ్లాప్ కాలేదు . కనీసం ఆదివారాలు సెలవు రోజుల్లో కూడా కలెక్షన్లు చేయలేకపోయింది. సినిమా ఫ్లాప్ ను తొందరగానే వరుణ్ తేజ్ తొందరగానే అంగీకరించేశారు . దీంతో వరుణ్ తేజ్ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అభిమానులకు పంపించాడు .

    అభిమానులు ప్రేమాభిమానాలకు తాను ఎప్పుడు విధేయుడని, సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నిర్మాతలకు ధన్యవాదాలు అని చెబుతూ ఒక మంచి సినిమాగా దీన్ని తీసుకురావాలని చాలా కష్టపడ్డానని ,అయితే సినిమా మా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది అని చెప్పాడు . ఆలోచనలో అనుకున్నవన్నీ తెరమీద ఆచరణ లో చూపించలేక పోనని ఒప్పుకున్నాడు . అభిమానులను ప్రేక్షకులను సంతోషపెట్టాలని కష్టపడ్డానని అయితే కొన్నిసార్లు గెలుపు , ఓటమి తప్పవని అన్నారు. ఈ సినిమా నుంచి ఒక పాఠం నేర్చుకుంటానని , కష్టపడి మాత్రం పని చేస్తానని వరుణ్ తేజ్ చెప్పాడు.

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..