కంపెనీ లోనే 20 ఈవి స్కూటర్లు దగ్ధం.. భద్రతపై కేంద్రం డౌట్..

  0
  711

  ఎలక్ట్రిక్ స్కూటర్లు , ఎలక్ట్రిక్ బైక్ లు భద్రత పై తీవ్రమైన చర్చ జరుగుతోంది . తాజాగా నాసిక్ లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్ లు కాలిపోవడంతో ఈ విషయమై సంచలనం రేకెత్తించింది . దీంతో కేంద్ర ప్రభుత్వం అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపై ఐఐటి నుంచి సమగ్రమైన నివేదిక కోరింది . పరిశ్రమకు సంబంధించిన పరిశోధన సంస్థలు కూడా ఈ విషయమై నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా నాసిక్ లో జితేంద్ర ఈవి స్కూటర్ కంపెనీ నుంచి 40 స్కూటర్లు కంటైనర్లో బయట పోతున్నాయి . ఫ్యాక్టరీ గేట్ దాటిన వెంటనే అందులో 20 స్కూటర్లు తగలబడి పోయాయి . ఇవన్నీ కూడా బ్యాటరీలు పేలిపోయి తగలబడ్డాయి అని తేలింది .

  ఏప్రిల్ 9 వ తేదీ జరిగిన ఈ సంఘటనతో ఆందోళన నెలకొంది. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే సమయంలో 40 స్కూటర్లలో , ఇరవై కాలిపోగా మిగిలిన వాటి భద్రత ఏమిటన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది . దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాలు పెనుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విషయమై తీవ్రంగా పరిశీలన జరపాలని కోరింది. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో లోపం ఏంటో గమనించి నివేదిక ఇవ్వాలని కోరింది . అంతవరకూ కంపెనీలు కూడా స్కూటర్లు తయారీ మోటార్ సైకిల్ తయారీ లో జాగ్రత్త వహించాలి అని స్పష్టం చేసింది.

  మార్చి 26వ తేదీన పూనాలో ఒక ఓలా స్కూటర్ కాలిపోయింది . ఈ సంఘటన తర్వాత రోజు తమిళనాడులోని వెల్లూరు లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ పేలి తండ్రి , 13 ఏళ్ల కూతురు చనిపోయారు. ఆ తర్వాత మరొక సంఘటన స్కూటర్ బ్యాటరీ పేలి 60 ఏళ్ళ వ్యక్తి చనిపోయాడు . ఒక దాని వెంబడి ఒకటిగా స్కూటర్లు బ్యాటరీలు పేలి పోతుండడంతో ఆందోళన నెలకొంది . తాజాగా జరిగిన ఆ సంఘటనతో అసలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపైనే అనుమానాలు నెలకొన్నాయి .

  ఎండాకాలంలో ఎలెక్ట్రిక్ స్కూటర్లు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ ఇంజనీర్లు చెబుతున్నారు.. ఇండియాలో ఈవీ వెహికల్స్‌ మార్కెట్‌ పుంజుకుంటోంది. 2020-21 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,34,821 ఈవీలు అమ్ముడవగా 2021-22 ఏడాదిలో 4,29,417 ఈవీలు అమ్ముడయ్యాయి. ఇలా నాలుగింతలు మార్కెట్‌ పెరిగిన తరుణంలో ప్రమాదాలు కలవరం కలిగిస్తున్నాయి. నాసిక్‌లో తాజాగా చోటు చేసుకున్న ఘటన ఈవీ స్కూటర్లకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా నమోదు అయ్యింది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.