వాలంటైన్ డే రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి..?

    0
    207

    ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ తర్వాత అత్యథిక గ్రీటింగ్ కార్డులు అమ్ముడయ్యేది వాలంటైన్స్ డే సందర్భంగానే. ప్రపంచ ప్రేమికులంతా ఆ రోజున తమ వాలంటైన్ కి కచ్చితంగా గ్రీటింగ్ కార్డ్ తో పాటు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటారు. అయితే గిఫ్ట్ తోపాటు మీరు వేసుకునే డ్రెస్ కూడా ఇంపార్టెంటే. అసలు వాలంటైన్ డే కి ఓ స్పెషల్ డ్రెస్ కోడ్ అంటూ ఉందని మీకు తెలుసా..?

    ప్రేమికుల రోజున ధరించే డ్రెస్‌ కూడా ఒక సందేశాన్ని పంపుతుందని చెబుతారు. ఆ సందేశాన్ని పసిగట్టేలా రంగులకూ కొన్ని అర్థాలు ఏర్పాటు చేసుకున్నారు.

    పింక్‌ : గోయింగ్‌ టు ప్రపోజ్‌

    బ్లూ : వెలకమ్‌ ఫర్‌ అప్లికేషన్స్‌

    ఆరెంజ్‌ : ఆల్రెడీ ఇన్‌ లవ్‌

    బ్లాక్‌ : నాట్‌ ఇంట్రస్టెడ్‌

    ఎల్లో : లవ్‌ ఫెయిల్యూర్‌

    గ్రీన్‌ : లవ్‌ యాక్సెప్టెడ్‌

    వైట్‌ : డబుల్‌ సైడ్‌ లవ్

    సాధారణంగా భారత్ లో అయితే వాలంటైన్ డే రోజు.. పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. అయితే అందరూ అలా వేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ డ్రెస్ లో కూడా ఇలాంటి అర్థాలుంటాయని అంటున్నారు.

    ఇక వాలంటైన్ వీక్ గురించి చెప్పాలంటే…

    ప్రపంచమంతా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్‌ వీక్‌ జరుపుకుంటుంది.
    ఫిబ్రవరి 7 రోజ్‌ డే. అంటే ఆరోజు గులాబీ పువ్వుల్ని ఒకరికొకరు గిఫ్ట్ గా ఇచ్చిపుచ్చుకుంటారు.
    ఫిబ్రవరి 8 ప్రపోజ్‌ డే. ఆరోజు ప్రపోజ్ చేస్తే ఫిబ్రవరి 14న లవ్ యాక్సెప్ట్ చేస్తారని అంటారు
    ఫిబ్రవరి 9 చాక్‌లెట్‌ డే. లవ్ లో ఉన్నవారు.. ఆరోజు ఒకరికొకరు చాక్లెట్ ఇచ్చి పుచ్చుకుంటారు.
    ఫిబ్రవరి 10 టెడ్డీ డే. లవర్స్ టెడ్డీలను గిఫ్ట్ లు గా ఇస్తారు.
    ఫిబ్రవరి 11 ప్రామిస్‌ డే. నేను నీకు మాత్రమే సొంతం, నువ్వు నాకు మాత్రమే సొంతం అనేలా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు.
    ఫిబ్రవరి 12 హగ్‌ డే. ఆలింగనంలో ఉండే మాధుర్యాన్ని ఆరోజు తనివితీరా చవి చూడాలట.
    ఫిబ్రవరి 13 కిస్‌ డే. ప్రేమికుల ముద్దూ ముచ్చటకు ప్రత్యేకంగా ఉన్న రోజు ఇది. నుదుటిన ముద్దు పెట్టి నువ్వంటే నాకు కేరింగ్ అని చెప్పాలా లేక, బుగ్గపై ముద్దు పెట్టే సాహసం చేయాలా, లిప్ టు లిప్ కిస్ లాగించేయాలా అనేది ప్రేమికుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ఉంటుంది.


    ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే. ఇక ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజంతా ప్రేమికులిద్దరూ కలసే ఉండాలంటారు. ఆరోజు ఒకరినొకరు విడిపోకుండా ఉంటే.. జీవితాంతం కలిసే ఉంటారని అర్థం అన్నమాట.

    ఇవీ చదవండి:

    ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..? 

    షర్మిల ఎవరు వదిలిన బాణం..?

    రాహువు అంటే మనకు భయం – ఆ దేశంలో భక్తి.. ఎక్కడచూసినా నిత్య పూజలే.