ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

    0
    1090

    ఉత్తరాఖండ్ లో ఇటీవల మంచు కొండలు కరిగి జల విలయం రావడం మన దేశంలోనే మొదటి సారి. అయితే ఈ జల విలయాన్ని గంట ముందుగానే చేపలు పసిగట్టాయి. గౌలి గంగన్, అలక నంద నదీ తీరాల్లోని గ్రామాల్లో ఒక అసాధారణమైన ప్రకృతి మార్పు కనపడింది.

    నదిలో ఉన్న చేపలు, రొయ్యలు, ఇతర జలచరాలు వేలకు వేలు ఒడ్డుకు వచ్చేశాయి. అలకనంద తీరంలో ఉదయం 9గంటలకు పక్క గ్రామస్తులు బుట్టలు తీసుకుని పరుగులు తీశారు. నిముషాల వ్యవధిలోనే బుట్టలనిండా చేపలు దొరికాయి. రైనీ నంద ప్రయాగ్, లంగాసు, కర్న ప్రయాగ్, లాసు.. గ్రామాల్లో ఎప్పూడూ లేని విధంగా చేపలు, రొయ్యలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. పెద్ద పెద్ద చేపలు కూడా నీళ్లపైనే, ఒడ్డునే ఈదుతూ కనిపించాయి. గిరస అనే ఊరిలో అయితే ప్రతి కుటుంబం బుట్టలనిండా చేపలు తెచ్చుకుంది.

    https://twitter.com/PIBDehradun/status/1358358455371767808?s=20

    చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇన్ని చేపలు ఒడ్డుకు ఎందుకు కొట్టుకొచ్చాయా అని ఆలోచించే తరుణంలోనే నిముషాల వ్యవధిలో నదులు వరద ఉధృతితో పొంగి పొర్లాయి. జల విద్యుత్ కేంద్రాలను, డ్యామ్ లను సర్వనాశనం చేసి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయేందుకు కారణం అయ్యాయి. అర్థం కాని సమస్యను, రాబోయే ముప్పుని గంట ముందుగానే చేపలు, రొయ్యలు, పీతలు ఎలా కనుగొన్నాయని అర్థమయింది. చమోలి, తపోవన్ గ్రామాల్లో కూడా నదులు పొంగకముందే చేపలు ఒడ్డుకి కొట్టుకొచ్చాయి.

    ఈ విషయమై జీవ సంబంధ శాస్త్రవేత్తలు వివరణ ఇస్తూ చేపల్లో ఉండే సెన్సార్స్ ముందుగా వచ్చే ప్రమాదాన్ని పసిగడతాయని, నీటి ఒత్తిడిలో, నీటి ప్రవాహంలో వచ్చే మార్పులు సున్నితమైన సెన్సార్స్ వల్ల చేపలు పసిగట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటాయని చెప్పారు. నీటి ప్రవాహ వేగంలో స్వల్ప మార్పులను కూడా పసిగడతాయని వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా సీనియర్ సైంటిస్ట్ కె.శివకుమార్ చెప్పారు. ఉపద్రవానికి ముందు వచ్చే ఒకరకమైన శబ్దాన్ని కూడా చేపలు గ్రహిస్తాయని అన్నారు.

    ఇవీ చదవండి:

    షర్మిల ఎవరు వదిలిన బాణం..?

    నీకు షేపులు సరిగాలేవు.. కొంచెం సరిచూసుకోవాలి .. బూబ్స్ పెరగాలి ,