ఎస్సైలను బుట్టలో వేసుకుని..

  0
  3965

  హైదరాబాద్ లో ఎస్సైలకు సింహస్వప్నంగా ఉన్న ఓ నెరజాణ ఆటకట్టింది. ఏదో ఒక సాకుతో ఎస్సైలను బుట్టలో వేసుకుని ఆ తర్వాత వారి బట్టలూడదీయించి రాసలీలలకి ప్రోత్సహించి, ఇలా రకరకాలుగా తన గుప్పెట్లో బంధించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేసే లతా రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు వేరే కేసులో ఇరికించి జైలుకి పంపారు. ఆమె ఓర చూపులకి జావగారిపోయి లక్షలు సమర్పించుకున్న ఎస్సైలు, తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.

  టైలర్ దుకాణం మాటున బ్లాక్ మెయిలింగ్..

  హైదరాబాద్ హస్తినాపురంలో నివశించే ఆ మహిళకు ఓ టైలర్ దుకాణం కూడా ఉంది. ఆమె భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని, అతనిపై కూడా దొంగ కేసులు పెట్టింది. ఈ కేసులో రాజీ కుదుర్చుకుందామని, కేసు కొట్టేయాలని మళ్లీ పోలీసులకు చెప్పింది. ఈ కేసు విషయం మాట్లాడాలని ఎస్సైని ప్రశాంత్ నగర్ లోని తన గదికి పిలిపించి, అసభ్యంగా మాట్లాడాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఇద్దరు ఎస్సైలు కూడా తనని గన్ తో బెదిరించి, సెక్స్ కోసం ఒత్తిడి చేశారని, వారిని బెదిరించి రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇదే విధంగా మరో ముగ్గురు ఎస్సైలనుంచి లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి గుంజిందని తేలింది.

  చాటింగ్ ని అడ్డు పెట్టుకుని బెదిరింపులకు

  ఎస్సైల ఫేస్ బుక్ ఖాతాలనుంచి, ఫోన్ నెంబర్లు తీసుకుని స్నేహం పెంచుకుంటుంది. సన్నిహితంగా మెలిగిన ఫొటోలు, చాటింగ్ ని అడ్డు పెట్టుకుని బెదిరింపులకు దిగుతుంది. ఇలాగే పలువులు ఎస్సైల మీద కేసులు కూడా పెట్టింది. కొందరైతే కేసులు పెట్టకుండా 5లక్షలు, 10లక్షలు ఆమెకి సమర్పించుకుని తప్పించుకున్నారని తెలుస్తోంది. కొందరు ఎస్సైలు, డబ్బులిచ్చి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఆమెతో ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకున్నారని చెబుతున్నారు. పోలీసుల్నే కాకుండా, కొంతమంది ప్రభుత్వ అధికారుల్ని కూడా ఇలాగే బెదిరించేది.

  భర్తను వదిలేసి, మరొకరితో సహజీవనం చేస్తుంది. ఆ సహజీవనం చేస్తున్న వ్యక్తి, తన కుమార్తెపై అత్యాచారం చేయబోయాడని కూడా కేసు పెట్టింది. అతడినుంచి రూ.10లక్షలు ఒక ఫ్లాట్ కొట్టేసి, సహజీవనం చేస్తున్న వ్యక్తిని కూడా బయటకు తరిమేసింది. ఇలా ఈ కిలాడి లేడీ కథలు కోకొల్లలు. ఎట్టకేలకు ఆమెను తన షాపుకి వచ్చిన ఓ వినియోగదారుడ్ని కులం పేరుతో దూషించిందని, వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్ కి తరలించారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/a6Vner0Vd5c