రేపిస్ట్ నిపెళ్లాడుతా-కోర్టులోబాలిక పిటీషన్.

    0
    7918

    కేరళలో 2016లో సంచలనం కలిగించిన మైనర్ రేప్ సంఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో టెన్త్ క్లాస్ చదివే 16 ఏళ్ళ అమ్మాయిని క్యాథలిక్ చర్చి ఫాథర్ రాబిన్ వడక్కుమ్ చెర్రీ రేప్ చేసాడు. ఆ బాలికను కంప్యూటర్ డేటా ఎంట్రీకని పిలిపించి , అత్యాచారం చేసాడు. ఈ విషయం బయటకు చెప్తే , అమ్మాయి తండ్రిని , తమ్ముడిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక మౌనంగానే వాడి వేధింపులు భరించింది. కడుపునొప్పిహ ఉందని చెప్పడంతో , హాస్పిటల్ కి తీసుకెళ్లారు. బాలిక గర్భవతి అనిచెప్పడంతో , అసలు గుట్టు బయటపడింది. 2017లో ఆ బాలిక బిడ్డను ప్రసవించింది. దీంతో పోలీసులు కేసునమోదు చేశారు. కోర్టు కూడా వేగంగా విచారణ చేసి , అతడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. 2019 నుంచి వాడు జైల్లోనే ఉన్నాడు. తరువాత , అమ్మాయికి 18 నిండటంతో , తాను బాధితురాలిని పెళ్లిచేసుకుంటానని , బిడ్డని పోషించుకుంటానని కేరళ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసాడు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. ఇలాంటి ప్రతిపాదనలకు ఒప్పుకుంటే , రేప్ చేసే వాడు , శిక్ష పడ్డ తరువాత పెళ్లిచేసుకుంటానంటూ ముందుకొచ్చి , శిక్ష తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని కోర్టు వ్యాఖ్యానించి పిటీషన్ కొట్టివేసింది. దీంతో ఇప్పుడు అత్యాచార బాధితురాలిచేత చెర్రీని పెళ్లిచేసుకునేందుకు అనుమతించమని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయించాడు. ఇది తన స్వంత నిర్ణయమని కూడా బాలిక పిటీషన్లో పేర్కొంది.. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది..

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?