కూతురికి రెండోపెళ్లి చేసేందుకు ఓ తల్లి దారుణం

  0
  3652

  కూతురికి రెండో పెళ్లి చేసేందుకు ఏడాదిన్న‌ర వ‌య‌సున్న బాబును ఓ మ‌హిళ చంపేసింది. ఈ దారుణ ఘ‌ట‌న సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో శుక్ర‌వారం జరిగింది, ఈరోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజంపేట ఏరియాకు చెందిన‌ సుజాత అనే మ‌హిళకు కొన్నేండ్ల క్రితం సంగారెడ్డి పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి బాబు పుట్టడానికి కొన్ని నెల‌ల ముందు సుజాత భ‌ర్త మ‌ర‌ణించాడు. ఆ త‌ర్వాత జ‌నార్ధ‌న్ అనే మ‌రో వ్య‌క్తితో సుజాత వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తోంది.

  అయితే తాను సుజాతను పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయి ఉండకూడదని నియమం పెట్టాడు జనార్దన్. ఆ విషయాన్ని సుజాత తల్లికి చెప్పాడు. దీంతో బాబుని అడ్డుతొలగించి, కూతురికి పెళ్లి చేయాలనుకుంది సుజాత. ఈ క్ర‌మంలో మనవడు అనే మమకారం కూడా లేకుండా శుక్ర‌వారం ఉద‌యం బాబును తీసుకుని స‌మీప బావి వ‌ద్ద‌కు వెళ్లి దాంట్లో ప‌డేసింది.

  త‌న కుమారుడు కనిపించ‌డం లేదంటూ శుక్ర‌వారం రోజు సంగారెడ్డి పోలీసుల‌కు సుజాత ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాజంపేట ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించారు. బాబును నాగ‌మ‌ణి తీసుకెళ్లిన దృశ్యాలు ల‌భ్య‌మ‌య్యాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించ‌గా చేసిన నేరాన్ని అంగీక‌రించింది. నాగ‌మ‌ణితో పాటు జ‌నార్ధ‌న్ ను పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?