ఆగస్ట్ 1 తర్వాత ఏటీఎంకి వెళ్లారో జాగ్రత్త..

    0
    1290

    ఏటీఎం చార్జీలను బ్యాంకులు భారీగా పెంచాయి. పొరపాటున ఒక బ్యాంకు డెబిట్ కార్డు తీసుకుని, ఇంకో బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లారంటే మీ వీపు విమానం మోత మోగిపోయినట్టే లెక్క. అవును, ఆగస్ట్ 1 తర్వాత బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సేవల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు ఛార్జీలు పెరిగాయి.

    ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజు వసూలు చేస్తారు. రూ.15 నుంచి రూ.17 వరకు దీన్ని వసూలు చేస్తారు. ఒక బ్యాంకు కార్డు తీసుకుని, ఇంకో బ్యాంకు ఏటీఎంలోకి వెళ్తే ఇంటర్ చేంజ్ చార్జీలు వసూలు చేస్తారు. ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నా ఈసారి భారీగా పెరిగాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు వ్యయాలు పెరగడంతో ఈ ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?