వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపిస్తేనే మద్యం..

  0
  351

  వ్యాక్సిన్ వేయించుకున్నవారికే రేషన్ సరకులు, వ్యాక్సిన్ వేయించుకుంటేనే గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం అంటూ చాలా రకాల కండిషన్లు విన్నాం. తాజాగా.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే మద్యం కొనుగోలుకి అర్హత అంటూ కొత్త లింకు పెట్టారు. అయితే తెలుగు రాష్ట్రాల మందుబాబులు ఈ నిబంధన చూసి భయపడక్కర్లేదు.కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్నవారికే రేషన్ సరకులు ఇచ్చేలా నిబంధన పెట్టారు. దీంతో రేషన్ కోసమైనా చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పుడదే రూల్ తమిళనాడులో మందుబాబులకు అమలు చేస్తున్నారు.

  కరోనాని భయపెట్టే అసలు సిసలు వ్యాక్సిన్ మందేనంటూ మత్తులో తూగే మందుబాబులకు తమిళనాడులోని నీలగిరి జిల్లా అధికారులు షాకిచ్చారు. ఆధార్ కార్డ్, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ధృవీకరణ పత్రం చూపిస్తేనే ఇకపై మందు అమ్ముతామని చెప్పారు. దీంతో చాలామంది కంగారు పడ్డారు. మొదటి రోజు పక్కవారిని బతిమిలాడి మందు తెప్పించుకున్నా.. రెండోరోజు మాత్రం ఎవరికి వారే వైన్ షాపు కంటే ముందు వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్తున్నారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్