ఢిల్లీలో బ్రిటిషర్లు వాడిన సొరంగం ఇది..

  0
  1004

  ఢిల్లీలో బ్రిటీష‌ర్లు వాడిన సొరంగ మార్గం ఇది. ఢిల్లీ అసెంబ్లీలో ఈ సొరంగ ప్రవేశ ద్వారం ఉంటుంది. అక్కడినుంచి దాని వెంట వస్తే, అది నేరుగా ఎర్రకోటకు దారి తీసినట్టు తెలుస్తోంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను త‌ర‌లించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీష‌ర్లు వాడిన‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్ర‌కోట వ‌ద్ద‌కు స్వాతంత్ర సమర యోధుల్ని తరలించేవారని అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తెలిపారు.

  1993లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన‌ప్పుడు ఈ విషయం గురించి వినేవాడినని గోయెల్ చెప్పారు. ఆ తర్వాత ఆ సొరంగం గురించి తెలుసకునే ప్రయత్నం చేసినా కుదరలేదని అన్నారు గోయెల్. ఇప్పుడు ఆ ట‌న్నెల్‌ కు చెందిన ముఖ‌ ప్ర‌దేశాన్ని గుర్తించామ‌ని, కానీ దాన్ని తవ్వడంలేదని చెప్పారు. ఆ మార్గంలో మెట్రో పిల్ల‌ర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉంటాయ‌ని అన్నారు.

  1912లో కోల్‌ క‌తా నుంచి ఢిల్లీకి రాజ‌ధానిని మార్చారు. అంత‌క‌ముందు ఢిల్లీ అసెంబ్లీని సెంట్ర‌ల్ లెజిస్టేటివ్ అసెంబ్లీగా వాడేవారు. అయితే 1926లో అసెంబ్లీ ప్రాంగ‌ణాన్ని కోర్టుగా మార్చారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను కోర్టుకు తెచ్చేందుకు ఈ ట‌న్నెల్ మార్గాన్ని వాడేవార‌ని స్పీక‌ర్ గోయ‌ల్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్స‌వ సంబ‌రాల నేప‌థ్యంలో ట‌న్నెల్ ప్రాంతాన్ని విజిట్ చేసిన‌ట్లు చెప్పారు.

   

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్