12 వ మొగుడుగా ఎవడొస్తాడో..? ఆమె ఎదురు చూపు.

  0
  905

  ఆమెకు పెళ్ళిళ్ళు అంటే మ‌హా ఇష్టం. ఒక‌టి కాదు రెండు కాదు… ఇప్ప‌టివ‌ర‌కు 11 పెళ్ళిళ్ళు చేసుకుంది. 11 మంది మొగుళ్ళ‌ను మార్చింది. ఇప్పుడు 12వ భ‌ర్త కోసం వెయిటింగ్ లో ఉంది. ఆమె పేరు మొనెట్ జియాస్‌. ఉత్తావాలో ఉంటుంది. 52 ఏళ్ళ ఈ మ‌హిళ ఎక్కువ మంది మొగుళ్ళ‌ను మార్చాల‌నేది ఆమె ధ్యేయ‌మ‌ని పేర్కొంది. ఒక్కొక్క‌రితో వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అనుభ‌వించి, తెలుసుకుని.. దాన్ని ఆత్మ‌క‌ధ‌గా రాయాల‌న్న‌ది త‌న సంక‌ల్ప‌మ‌ని చెబుతోంది.

  తాను చాలా వేగంగా ప్రేమ‌లో ప‌డిపోతాన‌ని, ప్రేమించ‌డం మొద‌లు పెడితే చాలా నిజాయితీ ఉంటాన‌ని పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు 28 మందిని ప్రేమించి వాళ్ళ‌కు ప్ర‌పోస్ చేస్తే 11 మాత్ర‌మే స‌క్స‌స్ అయ్యి, పెళ్ళి వ‌ర‌కు వ‌చ్చాయ‌న్నారు. ప్ర‌స్తుతం 12వ డేటింగ్ కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపింది. త‌న ప్ర‌తి ప్రేమ‌లోనూ చాలా ప‌విత్ర‌త ఉంద‌ని చెప్పింది.

  అతి ఎక్కువ కాలం 9 ఏళ్ళ పాటు త‌న వైవాహిక జీవితం కొనసాగింద‌ని, అతి త‌క్కువ కాలం 6 నెల‌లు మాత్ర‌మే కొన‌సాగింద‌ని చెప్పింది. పెళ్ళి కాకుండా తాను ఎవ‌రితో శృంగారంలో పాల్గొనే ప్ర‌శ్నే లేద‌ని స్ప‌ష్టం చేసింది.

  తాను ఎవ‌రితో డేటింగ్ చేసినా శృంగానికి అంగీక‌రించ‌న‌ని, పెళ్ళి త‌ర్వాతే అన్నీ చేస్తాన‌ని పేర్కొంది. 57 ఏళ్ళ వ్య‌క్తి రెండుసార్లు పెళ్ళి చేసుకుని, రెండుసార్లూ డైవ‌ర్స్ ఇచ్చాడ‌ని తెలిపింది. ఇప్ప‌టికీ 12వ పెళ్ళి కోసం చాలామంది మెసేజ్‌లు పంపార‌ని, అవ‌న్నీ ప‌రిశీలిస్తున్నాన‌ని చెప్పింది. త‌న‌కంటే 15 ఏళ్ళ వ‌య‌సు త‌క్కువ ఉన్న‌వారినే కోరుకుంటాన‌ని జియాస్ క్లారిటీ ఇచ్చింది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.