సమంత స్పీడ్‌కి బ్రేకుల్లేవ్ !
================
అక్కినేని నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత స్పీడ్ కి బ్రేక్ పడడం లేదు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ రయ్ మంటూ దూసుకుపోతోంది. ఇటీవలే ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ మూవీకి సైన్ చేసిన సామ్… ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ రోల్ లో సామ్ నటిస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంతో దర్శక ద్వయం హరి-హరీశ్ వెండితెరకు పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ‘యశోద’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.