ఎర్ర చీమల చట్నీ తినమని మేము చెప్పలేం..

    0
    419

    దేశంలోని ప్రజలందరికీ ఎర్ర చీమల చట్నీ తినమని మేము చెప్పలేం.. కావాలంటే మీరు , మీ క్లయింట్ తినండి.. అంటూ సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. ఎర్ర చీమల చట్నీ కరోనా రాకుండా అడ్డుకుంటుంటుందని , అందువల్ల దీన్ని కరోనా నివారణ ముందుగా గుర్తించి , అందరూ ఈ చట్నీ తినేవిధంగా చెయ్యాలని , ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని , ఒరిస్సాకు చెందిన నయధర్ పాడియాల్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటీషన్ వేసాడు.

    ఈ పిటిషన్ పై , జస్టిస్ వైవి చంద్రచూడ్ , ధనుంజయ లతో కూడిన బెంచ్ విచారణచేసి తీర్పు చెప్పింది. ఒరిస్సా , ఛత్తీస్ ఘడ్ , తదితర రాష్ట్రాల్లో గిరిజనులు , ఎర్రచీమల చట్నీ తింటారు.. ఎర్ర చీమల సూప్ కూడా తాగుతారు. జ్వరం , దగ్గు , జలుబు లాంటి వ్యాధుల నివారణకు ఎర్ర చీమల చట్నీ మంచిదని , వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. దీంతో నయధర్ పాడియాల్ ఎర్ర చీమల చట్నీ కరోనా నివారణకు పనికొస్తుందని ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేశాడు..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్