కడుపులో ఉన్న బిడ్డను వీటి కోసం అమ్మేసింది..

  0
  787

  గర్భంలో ఉన్న బిడ్డ ను అమ్ముకున్న నీచమైన తల్లిదండ్రులు ఆ బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బుతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, మోటార్ సైకిల్ కొనుక్కుని కులుకుతున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ డీల్ చేసిన బ్రోకర్ ని పట్టుకొని , అందరిపై కేసు పెట్టి జైలుకు తరలించారు . మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఈ దారుణం వింటేనే వళ్ళు జలదరిస్తుంది.

  షాయినాబీ అనే మహిళ ఏడో నెల గర్భంతో ఉండగానే తనకు పుట్టబోయే మగ బిడ్డకు ఐదు లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. పూజ వర్మ, నీనా వర్మ అనే ఇద్దరు మహిళా బ్రోకర్లు బిడ్డ కొనుగోలులో ఐదు లక్షలకు బేరం మాట్లాడారు. లీనా అనే మహిళకు బిడ్డను అమ్మెందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రసవించిన 15 రోజుల తర్వాత బిడ్డను అమ్మేసి డబ్బులు తీసుకున్నారు. బ్రోకర్ల కమిషన్ పోను , షయినాబీకి 2 లక్షల 70 వేల రూపాయలు ఇచ్చారు.

  ఈ డబ్బులతో ఇంటికి అవసరమైన టీవీ , ఫ్రిజ్ , వాషింగ్ మిషన్ , మోటార్ సైకిల్ కొనుక్కుని అంట సర్దుకున్నారు. ఈ విషయాన్ని ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చుకునేందుకు ,కుటుంబ పోషణ కోసం ,బిడ్డలను పోషించలేక ,పేదరికం వలన లేదా అక్రమ సంతానం అన్న భయంతోనూ బిడ్డను అమ్ముకున్న సందర్భాలున్నాయి.. కానీ ఇంట్లో వస్తువుల కోసం బిడ్డను , గర్భంలోనే ఉండగా అమ్ముకున్న దారుణం దేశంలో ఇదే ప్రధమం..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..