తల్లి,కూతుళ్లు, ప్రియుళ్లు,నమ్మలేని ఘోరం.

  0
  342

  ప్రియుళ్ళతో పెళ్లిళ్ల కోసం ఇద్దరు కూతుళ్లు , తల్లి కలిసి కుటుంబం మొత్తానికి విషమిచ్చి చంపేసే ప్రయత్నం చేసిన దారుణం ఇది. ఈ ఘోరం లో నోయిడాలోని బుద్దనగర్ లో జరిగింది. గౌతమ బుద్ధ నగర్ లో 45 ఏళ్ల రాజకుమారి అనే మహిళకు కి ఇద్దరు కూతుర్లు.. జ్యోతి , అర్చన అనే పేరు గల ఇద్దరు కూతుళ్లు దీపక్, అభిషేక్ అనే ఇద్దరు యువకులను ప్రేమించారు. అయితే వీళ్ళిద్దరూ తమ ప్రియుళ్లను పెళ్లి చేసుకోవడానికి తండ్రి దేవేంద్ర మరియు అతని తల్లి రీనా దేవి ఒప్పుకోలేదు. దేవేందర్ అతడి తల్లి ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో భార్య రాజకుమారి , భర్త , అత్త , మిగిలిన ఇద్దరు పిల్లలను విషమిచ్చి చంపేసి పారిపోయి ఆ ఇద్దరు యువకులతో ,తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాలని పథకం వేసింది.

  తన పథకాన్ని కూతుళ్లకు చెప్పింది. దీంతో కూతుళ్లు , తమ ప్రియుళ్ళకు తల్లి ప్లాన్ వివరించారు. ప్రియుళ్లు దీపక్, అభిషేక్ నోయిడాకి వచ్చి ఒక గది అద్దెకు తీసుకొని పథకం వ్యూహరచన చేశారు . రాజకుమారికి పాయిజన్ ట్యాబ్లేట్లు ఇచ్చారు. ఆమె రాత్రి భోజనంలో తన భర్త కు , అత్తకు మరో ఇద్దరు పిల్లలు 13, 14 ఏళ్ల వయసున్న పిల్లలకు భోజనంలో పెట్టింది . రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తన కూతుళ్లతో కలిసి , వాళ్ళ ప్రియుళ్ళ సాయంతో సామాను తీసుకొని వెళ్లిపోయారు.

  ఈ లోగా ఇంట్లో కుటుంబ సభ్యులు స్పృహలో లేకపోవడం చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు హడావిడిగా వచ్చి స్పృహలో లేని వారిని ఆసుపత్రిలో చేర్పించి కేసు దర్యాప్తు ప్రారంభించారు . స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజకుమారి , ఆమె కూతుళ్లు ఇద్దరు జ్యోతి, అర్చన ఎక్కడున్నారో పోలీసులు కనిపెట్టేశారు. ఇతర ప్రాంతాల పోలీసుని అప్రమత్తం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విషప్రయోగానికి గురైన నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..

   

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..