గిఫ్ట్ పేలి ,పెళ్లికొడుక్కి కళ్ళుపోయాయి.

    0
    492

    ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకుందన్న కారణంతో ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లిలోప్రియురాలి భర్తకు ఇచ్చిన గిఫ్ట్ పేలి పెళ్ళికొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అతని రెండు కళ్ళు పోయాయి. గుడ్డివాడై పోయాడు. చెయ్యి తెగి కింద పడిపోయింది . అతని మేనల్లుడు కూడా ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డాడు . గుజరాత్ లోని నవసారి జిల్లాలో ఈ దారుణం జరిగింది.

    లతీష్ అనే యువకుడు ఈనెల 12వ తేదీన సల్మా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. సల్మాకి తన అక్క మాజీ ప్రియుడు రాజు ధనుష్ పటేల్ తో సంబంధం ఉంది. అక్కకు పెళ్ళైపోయిన తరువాత సల్మా రాజు ధనుష్ పటేల్ వలలో పడింది., అయితే సల్మా ప్రియుడు రాజుని కాదని , మరొకడితో పెళ్లికి సిద్దమై 12 వతేదీన పెళ్లి చేసుకుంది. పెళ్లిలో సల్మా ప్రియుడు రాజు పటేల్ పెళ్ళికొడుకు లతీష్ కు ఒక గిఫ్ట్ ఇచ్చాడు.

    గిఫ్ట్ లు ఎక్కువ రావడంతో పెళ్లి పనులు అయిపోయిన ఐదు రోజుల తర్వాత గిఫ్టులు 17 వతేదీన ఓపెన్ చేశారు. మాజీ ప్రియుడు రాజు ధనుష్ పటేల్ ఇచ్చిన గిఫ్ట్ పెళ్ళికొడుకు ఓపెన్ చేస్తే అది పెద్ద శబ్దంతో పేలి, పెళ్ళికొడుకు తీవ్రంగా గాయపడ్డాడు . ఈ పేలుడులో అతని రెండు కళ్ళు పోయాయి. చెయ్యి కూడా తెగి కింద పడిపోయింది . తనని కాదని తన ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోవడమే ప్రియుడు ఈ దారుణానికి ఒడిగట్టిన కారణం.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

     

    ఇవి కూడా చదవండి..

    ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..