నెల్లూరులో తుపాకీ గుట్టు బీహార్ లో..

  0
  208

  నెల్లూరు జిల్లా తాటిపర్తిలో కావ్యశ్రీ అనే అమ్మాయి హత్యకు, నిందితుడు సురేష్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన తుపాకీ బీహార్ నుంచి తెప్పించారనే విషయాన్ని నెల్లూరు జిల్లా పోలీసులు నిర్థారించారు.
  సురేష్ రెడ్డికి పిస్టల్ అమ్మిన రమేష్ అనే వ్యక్తిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురే,్ రెడ్డి సెల్ ఫోన్ ఆధారంగా పిస్టల్ ఎక్కడినుంచి తెప్పించారనే విషయాన్ని తెలుసుకున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు.

  2021 అక్టోబర్ నుంచే సురేష్ రెడ్డి కావ్యశ్రీని మట్టుబెట్టాలని అనుకున్నాడు. తనతో పెళ్లికి నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంటర్నెట్ లో తుపాకీలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు అమ్ముతారు, ఎలా వాటిని వాడాలి అనే విషయాలను పరిశోధించాడు. చివరకు బీహార్ లోని ఓ గ్యాంగ్ తో సంబంధం ఏర్పరచుకున్నాడు. డిసెంబర్ లో బీహార్ లోని పాట్నాకు వెళ్లాడు సురేష్ రెడ్డి.

  పాట్నాలో ఉమేష్, రమేష్ అనే అన్నదమ్ములున్నారు. రమేష్ అనే వ్యక్తి కారు డ్రైవర్. సురేష్ రెడ్డి ఈ రమేష్ తో స్నేహం ఏర్పరచుకుని తుపాకీ కావాలని అడిగాడు. అతను ఉమేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ తరత్వాత వారిద్దరూ నమ్మకం కుదుర్చుకుని సురేష్ రెడ్డికి పిస్టల్ అమ్మారు. 20రోజులపాటు అక్కడే ఉండి తుపాకీని కొన్నాడు. ఆ తర్వాత దాన్ని వాడే విధానం తెలుసుకున్నాడు. అక్కడే అన్ని ట్రయల్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత తిరిగి నెల్లూరు జిల్లాకు వచ్చి అదనుకోసం వేచి చూశాడు.

  తుపాకీ కొన్నది 2021 డిసెంబర్ అయితే, పథకం అమలు చేసింది 2022 మే నెలలో. అంటే ఈ మధ్య కాలంలో సురేష్ రెడ్డి చాలా తర్జన భర్జన పడినట్టు తెలుస్తోంది. కావ్యశ్రీని మాత్రమే అంతం చేయాలా, లేక తాను కూడా చనిపోవాలా అని ఆలోచించి ఉంటాడని తెలుస్తోంది. కావ్యశ్రీని చంపేసిన తర్వాత భయంతో సురేష్ రెడ్డి కూడా తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

  సురేష్ రెడ్డికి తుపాకీని సప్లై చేసిన రమేష్ ని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం బీహార్ నుంచి రమేష్ ని పిలిపించారు. రెండురోజులపాటు అతని నుంచి పూర్తి సమాచారం సేకరించి అరెస్ట్ చేశారు. అతడి అన్న మరో ప్రధాన ముద్దాయి ఉమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈమేరకు నెల్లూరు అడిషనల్ ఎస్పీ వివరాలు తెలియజేశారు.

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..