పగ పట్టిన కుక్కలు ఇలా తీర్చుకున్నాయి ..

    0
    13521

    కసి, కక్ష మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా ఉంటాయి. ఇదేదో కథ, కల్పన కానే కాదు. ఓ వ్యక్తి తన ఇంటిముందు కారు పార్క్ చేసుకునేందుకు అప్పటి వరకు అక్కడ పడుకుని ఉన్న కుక్కను కొట్టి తరిమేశాడు. ఆ తర్వాత కారు పార్క్ చేశాడు. చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్లాడు.

     

    అయితే అప్పటికి అక్కడినుంచి వెళ్లిపోయిన కుక్క అరగంట తర్వాత ఓ 10 కుక్కలను తోడు తెచ్చింది. తెచ్చి, ఆ కారుమీదకు ఎక్కి వైఫర్లు, రబ్బర్ బీడింగ్స్ ను, టైర్లు ఇలా ఎక్కడ దొరికితే అక్కడ వీలున్నంత వరకు కొరికేశాయి. చివరకు పళ్లతో ఆ కారు బంపర్లు అన్నిటినీ కొరికి పారేశాయి.

     

    గంట తర్వాత కిందగు దిగివచ్చిన కారు యజమానికి ఒక కుక్కను కొట్టినందుకు మిగిలిన కుక్కలు అన్నీ వచ్చి తన కారుమీద పగ తీర్చుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. కుక్కలకు విశ్వాసమే కాదు, పగ, ప్రతీకారాలు కూడా ఉంటాయని దీన్నిబట్టి తెలుస్తోంది. ఈ ఘటన చాంగ్ పింగ్ లో జరిగింది.

     

    ఇవీ చదవండి

    బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

    కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.