బెంజి కారు..ఆటోని కొట్టి బజ్జీలా మారింది..

  0
  5836

  ఓ మహిళ తప్పతాగి బెంజి కారు డ్రైవ్ చేస్తూ బీభత్సం సృష్టించింది. దాదాపు 75 లక్షలు విలువ చేసే ఈ కారులో ఆమె కర్నాటకలోని హలసూర్ లో వేగంగా పోతూ ముందున్న వాహనాన్ని ఢీకొంది. కారు కంట్రోల్ చేసుకోలేకపోవడంతో వరుసహా వాహనాలను ఢీకొడుతూ పోయింది.

  ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఆ మహిళ పేరు నందిత చౌదరి. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన మహిళ కావడంతో యాక్సిడెంట్ తర్వాత తెలివిగానే తప్పించేసుకుంది. అయితే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో రెండు కారులు, ఆటో, ఒక టాటా ఏస్ వాహనం బాగా దెబ్బతిన్నాయి. మహంత అనే వ్యక్తి చనిపోయాడు.

  బెంజ్ కారు కూడా నుజ్జు నుజ్జయింది. దీన్నిబట్టి, ఆమె ఎంత వేగంతో కారు నడిపిందో అర్థం చేసుకోవచ్చు. కర్నాటకలోని బసవశంకర్ జిల్లా హలసూరులో ఈ ఘటన జరిగింది. బెంగళూరులో జరిగిన మరో బెంజ్ కార్ యాక్సిడెంట్ లో కారు డ్రైవ్ చేస్తున్న సువీత్ అనే వ్యక్తి ఏడు వాహనాలను ఢీకొట్టి మరో వ్యక్తి మృతికి కారణం అయ్యాడు. ఈ రెండు సంఘటనల్లో ప్రమాదానికి కారణం బెంజికారే కావడం గమనార్హం. రెండో సంఘటనలో బెంజ్ కారు అసలు నామ రూపాల్లేకుండా పోయింది.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.