రష్యాని వణికిస్తున్న ఉక్రెయిన్ క్షిపణి జావెలిన్.. స్పెషాలిటీ ఇదే..

  0
  578

  ఉక్రెయిన్ చిన్న దేశమైనా తనపై దాడి చేసిన రష్యాను గడగడలాడిస్తోంది. రష్యాకు చెందిన 280 యుద్ధ ట్యాంకులు తునాతునకలైపోయాయి. దీంతో రష్యా ఆలోచనలో పడింది. ఉక్రెయిన్ ఇన్ని యుద్ధ ట్యాంకులను ఎలా నాశనం చేసిందో పరిశీలిస్తే.. ఉక్రెయిన్ వద్ద నున్న జావెలిన్ అనే క్షిపణి ఉక్రెయిన్ సైనికుల చేతిలో పాశుపతాస్త్రం గా ఉందని నిర్ధారణ చేసుకుంది.

  ఈ జావెలిన్ క్షిపణి అత్యంత శక్తివంతమైనది. యుద్ధ ట్యాంకులను సమర్ధవంతంగా ముక్కలుముక్కలుగా చేయగలిగిన సామర్ధ్యం కలిగింది. కేవలం మూడు వందల క్షిపణులను ప్రయోగించి.. 280 యుద్ధ ట్యాంకులను నాశనం చేసింది. జావెలిన్ క్షిపణులను అమెరికా ఉక్రెయిన్ కు సరఫరా చేసింది. 2018లోనే ఈ క్షిపణులు ఉక్రెయిన్ కు చేరుకున్నాయి.

  వాటిని ప్రయోగించడంలో కూడా అమెరికా.. ఉక్రెయిన్ సేనలకు శిక్షణ ఇచ్చింది. జావెలిన్ క్షిపణులు రష్యా వద్ద ఉన్నట్టు రష్యాకు ఈ దాడి జరిగే వరకూ తెలియదు. జావెలిన్ క్షిపణులను ప్రయోగించేందుకు ఒక సైనికుడే సరిపోతాడు. దీనికోసం ప్రత్యేకమైన వాహనాలు కూడా అవసరం లేదు. T-72 వంటి దుర్భేద్యమైన యుద్ధ ట్యాంకులను కూడా జావెలిన్ క్షిపణి రెప్పపాటులో నాశనం చేయగలదు.

  ఈ ఒక్క క్షిపణి కారణంగానే ఇప్పుడు రష్యా ఎక్కువగా నష్టపోయింది. అతి కొద్ది రోజుల్లోనే ఇన్ని యుద్ధ ట్యాంకులను కోల్పోవడం చాలా పెద్ద విషయం. మరిన్ని జావెలిన్ క్షిపణులను ఉక్రెయిన్ కు ఇవ్వాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. వీటితో పాటూ యుద్ధ విమానాలను కూల్చివేయగల అత్యాధునిక క్షిపణులను కూడా అమెరికా.. ఉక్రెయిన్ కు సరఫరా చేయబోతోంది.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..