షేన్ వార్న్ మరణానికి ముందు ఇలా ఎందుకన్నాడు.. ?

  0
  726

  మూడు నెలల్లో చూడండి.. పాత షేపు లోకి వచ్చేస్తానంటూ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ , తన ఇంస్టా గ్రామ్ లో పోస్టింగ్ పెట్టిన , కొద్ది రోజుల్లోనే చనిపోయాడు.. బ్యాంకాక్ లో ఉండగానే ఆయన తన మార్నింగ్ వర్కవుట్ తరువాత ఈ ఫొటో షేర్ చేశారు. దానితరువాత , చనిపోయే దానికి 12 గంటలముందు , ఆస్ట్రేలియా వికెట్ కీపర్ రోడ్నీ మార్ష్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. విచిత్రంగా తరువాత తానే కనుమరుగైపోయాడు..

  ఆయన మరణానికి ముందు , ఇలా రెండు సంఘటనలు యాదృచ్చికమే అయినా , జీవితం నీటిబుడగలాంటిదన్న నిజానికి ఈ రెండు సంఘటనలు సాక్ష్యాలు. బ్యాంకాక్ లో ఒక విల్లాలో ముగ్గురు స్నేహితులతో ఉన్న షేన్ వార్న్ , భోజనానికి రాకపోవడంతో , వాళ్ళు గదిలోకి పోయి చూసారు. అచేతనంగా పడిఉన్న షేన్ వార్న్ కి , గుండెపోటు అనుమానంతో సిపిఆర్ చేసారు. స్పందన లేకపోవడంతో , హాస్పిటల్ కి తీసుకెళ్లారు.. అక్కడకూడా స్పందించలేదు. అప్పటికి గంటముందే షేన్ వార్న్ చనిపోయిఉంటాడని భావించారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..