ఇక నుంచి వారానికి నాలుగున్నర రోజులే పని..

    0
    441

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో , ప్రభుత్వం ఉద్యోగుల పనివేళలను , పనిదినాలను గణనీయంగా తగ్గించింది. ప్రపంచంలో ఇలాంటి చర్య తీసుకున్న దేశాలలో ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండోదిగా నిలిచింది. జనవరి ఒకటో తేదీనుంచి వారానికి నాలుగున్నర రోజులే పనిదినాలుగా నిర్ణయించారు.

    సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం ఏడున్నర నుంచి , మూడున్నర గంటలవరకు పని వేళలుగా నిర్దారించారు. శుక్రవారం మాత్రం ఉదయం ఏడున్నర నుంచి , మధ్యాహ్నం 12 వరకే పనిచేస్తారు. అక్కడ శుక్రవారం మధ్యాహ్నం 1-15 నుంచి దేశవ్యాప్తంగా ప్రార్థనలు మొదలవుతాయి.

    ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం , ఇంటినుంచి పనిచేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఉద్యోగుల్లో పనివత్తిడి తగ్గించి , వారాంతపు సెలవులు పెంచితే , పని చేసే విధానం , సమర్థత మరింత పెరగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది.. ఇప్పటికే ఫ్రాన్స్ లో వారానికి 35 గంటల పని విధానం ఉంది. అక్కడి నిబంధనల ప్రకారం వారానికి నాలుగు రోజుల మూడు గంటలు మాత్రమే , మొత్తం మీద 35 గంటలు పనిఉంటుంది.. అయితే అక్కడ వారాంతంలో ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో ఉండదు..

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.