తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ జూలీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఉన్నదంతా పోగొట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ జూలీకి ఏమైంది.. అసలెందుకు పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
తమిళ బిగ్ బాస్ షోలో పాపులర్ అయిన జూలీ ఇటీవలే షో నుంచి బయటకు వచ్చేసింది. టీవీల్లో పలు కార్యక్రమాలకు హోస్టింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. టీవీ నటి కూడా కావడంతో డబ్బుకు కొదవ లేకుండా పోయింది. అయితే ఇటీవల ఆమె వద్ద ఉన్న డబ్బంతా పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరో కాదు ఆమె ప్రియుడు మనీష్.. నాలుగేళ్లుగా ప్రేమించుకున్న మనీష్, జూలీ ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే కొద్దిరోజుల కాపురం తర్వాత మనీష్ ఓ రాత్రి ఎవరికీ చెప్పకుండా తన డబ్బు, నగలు అన్నీ తీసుకొని పరారయ్యాడని వాపోయింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం మొత్తం చెప్పి సాయం చేయాలని కోరింది. దీంతో అన్నా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ళ ప్రేమ ఇలా అర్థంతరంగా ముగిసిపోవడంతో జూలీ ఇప్పుడు తెగ కుమిలిపోతోందట..