కత్రినా పెళ్లి వేడుక , ఓటిటి రైట్స్ 100 కోట్లు..?

  0
  630

  క‌త్రినా కైఫ్–విక్కీ కౌశల్ ల వివాహం హాట్ టాపిక్ అయింది. డిసెంబర్ 9న వీరిద్ద‌రూ దంప‌తులు కాబోతున్నారు. ఇప్ప‌టికే ఈ జంట‌… రాజ‌స్థాన్ లో మకాం వేసింది. సంగీత్‌, మెహందీ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉందీ జోడీ. వాళ్లిద్దరి పెళ్ళి వేడుకను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఓ పెద్ద ఓటీటీ సంస్థ బంపరాఫర్ ప్రకటించినట్టు టాక్. 100 కోట్లు ఇస్తామంటూ కత్రిన, విక్కీలతో సదరు ఓటీటీ చర్చలు జరిపిందట.

  లైవ్ ప్రసారంలో భాగంగా మ్యారేజ్‌ లైవ్ ఫుటేజి, పెళ్లికి వచ్చిన అతిథులు, తారలు, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఇంటర్వ్యూల వంటి వాటిని టెలికాస్ట్ చేయ‌నున్న‌ట్లు స‌ద‌రు సంస్థ పేర్కొంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ స్టార్ సెలబ్రెటీకి దక్కని రేంజ్ లో వీరికి బంపరాఫర్ ఇవ్వడం విశేషం. గతంలో కొంతమంది స్టార్ కపుల్స్ కూడా వారి పెళ్లిని బిజినెస్ డీల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ.. ఇంత భారీ మొత్తంలో ఆఫర్ కొట్టేసిన మొదటి జంట మాత్రం కత్రీనా – విక్కీ కౌశల్ మాత్రమే.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.