కారులో కొబ్బరిబొండాల్లో మద్యం.. కేసులో కీలక ట్విస్ట్..

  0
  922

  హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో సంచలన నిజాలు తెలిసాయి. ఈ ప్రమాదంలో యు ట్యూబర్ , నటి గాయత్రీ , రోహిత్ అనే యువకుడు ప్రయాణిస్తున్న కారు గచ్చిబౌలి దగ్గర వేగంగా వచ్చి , రాజేశ్వరి అనే మహిళను ఢీకొని , ప్లాట్ ఫార్మ్ పై తిరగబడింది. రాజేశ్వరి అక్కడికక్కడే చనిపోగా , కారు నడిపే రోహిత్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్నాడు.

  గాయత్రీ తీవ్ర గాయాలతో చనిపోయింది. ఈ ప్రమాదంలో విచారణకోసం కారులో తనికీ చేయగా , రెండు కొబ్బరి బొండాలు చిక్కాయి. ఆ కొబ్బరి బోండాల్లో మద్యం ఉంది. హోలీ సందర్భంగా రోహిత్ , గాయత్రీ పార్టీ చేసుకున్నారు. మొత్తం ఆరు కొబ్బరిబొండాల్లో మద్యం నింపుకున్నారు. నాలుగు కొబ్బరిబొండాల్లో మద్యం తాగేసి , రెండు కార్లోనే పెట్టేసారు.

  ఇందుకోసం ఒక రోజుముందే మద్యం కొనిపెట్టుకున్నారు. హోలీ రోజు పబ్ కి వెళ్లిన వీరిద్దరూ , ఆ రోజు మద్యం కు అనుమతిలేకపోవడంవల్ల , ముందుగానే మద్యంకొని , పెట్టుకున్నారు. కొబ్బరిబొండాల్లో మద్యంనింపి , పబ్ కి తీసుకెళ్లారు. మద్యం మైకంలో అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..