చిన్ననాడు టీచర్ కొట్టిందని , 30 ఏళ్ళ తరువాత..

  0
  282

  ఇదో విచిత్రమైన కేసు .. ఆ కుర్రవాడు పగతో 30 ఏళ్ళు పగిలిపోయాడు. 30 ఏళ్లుగా తన టీచర్ పై పెంచుకున్న కసిని ఏ విధంగా తీర్చుకున్నాడో వింటే ఒళ్ళు జలదరిస్తుంది .. గంటర్ వెంట్స్ అనే వ్యక్తి ఏడేళ్ల వయసులో ఉండగా మెటిల్డాన్అనే టీచర్ అతడిని తీవ్రంగా కొట్టింది . క్లాస్ లో అల్లరి చేస్తున్నాడని ఆమె తన స్టూడెంట్ అయిన గంటర్ వెంట్స్ కొట్టింది. ఈ సంఘటన జరిగేనాటికి గంటర్ వెంట్స్ కు ఏడేళ్ల వయసు.. ఆనాటి దెబ్బలు అలాగే మనసులో ఉంచుకొన్న గంటర్ వెంట్స్ఇప్పుడు 37 ఏళ్ల వయసులో , 30 ఏళ్ల తర్వాత ఆ టీచర్ ఎక్కడుందో కనుక్కున్నాడు.

  బెల్జియం లోని యాంటీ వేరేప్ లో ,ఆమె ఇంటికొచ్చి , వంటరిగా వంటగదిలో ఉన్న ఆమెను నూటొక్క సార్లు కత్తితో పొడిచి చంపాడు ఇంట్లోకి వస్తూనే తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఒకప్పుడు టీచర్ చేతిలో దెబ్బలు తిన్న వాడు నేనే అని చెప్పుకున్నాడు . ఆ విషయం టీచర్ తో చెప్పిన తర్వాత వంటింట్లో కత్తి తీసుకుని నూట ఒక్క సార్లు పొడిచాడు. ప్రస్తుతం ఆమె వయస్సు 59 సంవత్సరాలు . హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు . ఆ తర్వాత పోలీసులు జరిపిన విచారణలో ఆచూకీ దొరకలేదు ఇంట్లో డబ్బు నగలు ఇతర విలువైన వస్తువులు పోలేదు. దీంతో ఈ హత్య డబ్బుల కోసం జరిగింది కాదని పోలీసులు ప్రాథమికంగా తేల్చుకున్నారు.

  ఆ తర్వాత గత 16 నెలలుగా ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు . అయితే ఈ మధ్య లోనే ఓ వ్యక్తి గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 30 ఏళ్లనాటి పగతీర్చుకునేందుకు టీచర్ ని చంపిన వ్యక్తి , ఆ విషయం తాగిన మైకంలో స్నేహితుడికి చెప్పాడు . దీంతో పోలీసులు గంటర్ వెంట్స్ ని అరెస్ట్ చేశారు . ఏడేళ్ళ వయసులో ఉన్నప్పుడు టీచర్ విపరీతంగా క్లాస్ రూమ్ లో కొట్టిందని అప్పటినుంచి , ఆమెపై పగ పెట్టుకున్నానని , పెద్దైనా అది తనను వదలలేదని చెప్పాడు. చిన్ననాటి పగ తీర్చుకునేందుకు ఈ పనిచేశానని ఒప్పుకున్నాడు..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..