అంతరిక్షంలోకి మటన్ కబాబ్.. ఎందుకో వీడియో చూడండి..

  0
  258

  అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తారు ,అంతరిక్షంలోకి రాకెట్లు ప్రయోగిస్తారు ,ఆ రాకెట్ల లో మనుషులుంటారు.. మొదట్లో అంతరిక్షంలోకి కుక్కలను పంపిన సందర్భం కూడా ఉంది . అయితే ఇప్పుడు ఓ వింత జరిగింది. అదేంటంటే టర్కీ లోని ఓ రెస్టారెంట్ యజమాని పెద్ద మటన్ కబాబ్ తయారు చేసి అంతరిక్షంలోకి పంపించాడు. ఇదేంటి అబ్బా , మటన్ కబాబ్ ని , అంతరిక్షంలోకి పంపడం ఏమిటా అని ఆశ్చర్యపోవద్దు. అంతరిక్షంలోకి మటన్ కబాబ్ పంపిన రెస్టారెంట్ యజమాని ఉద్దేశం మాత్రం చాలా మంచిది , అదేంటంటే మొదటి రష్యా వ్యోమగామి యూరిగగారిన్ అంతరిక్ష యాత్ర చేసి 61 సంవత్సరాలు అయింది.

  దీన్ని పురస్కరించుకొని ఆ రెస్టారెంట్ మటన్ కబాబ్ తయారు చేసి ఒక ప్రత్యేకమైన బెలూన్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించాడు.,దానికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి దాన్ని జిపిఆర్ఎస్ కు అనుసంధానం చేశాడు . మటన్ కబాబ్ తో బెలూన్ భూమికి 38 కిలోమీటర్ల ఎత్తు వరకు పోయి అక్కడ పేలిపోయింది , ఆ తర్వాత మటన్ కబాబ్ మధ్యధరా సముద్రంలో పడిపోయింది . దానికున్న ట్రాకింగ్ ద్వారా అది ఎక్కడ పడిపోయిందో కనుక్కొని సముద్రంలో నుంచి మటన్ కబాబ్ బయటకు తీసుకువచ్చారు . అంతరిక్ష యాత్ర 61 సంవత్సరాల వార్షికోత్సవాన్ని టర్కీ లోని ఈ రెస్టారెంట్ ఎంత తమాషాగా చేశాడు ఇప్పుడు వీడియో కూడా చూడండి..

  https://www.instagram.com/tv/Ccc6KAvO3b4/?utm_source=ig_web_copy_link

  ఇవీ చదవండి… 

  నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

  ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

  పోలీసులన్నాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా..??

  ఎమ్మెల్యే మేకపాటి తెల్లని బాతు లాంటివారు.. రెండో భార్య శాంత భలేచెప్పింది..