స్కూటీ 71 వేలు.. లక్కీ నంబర్ కి 15 లక్షల , 41వేలు…

  0
  663

  పావలా కోడికి అర్ద రూపాయి మసాలా అంటారు , కానీ ఇప్పుడు ఈ విషయం వింటే పావల కోడికి 250 రూపాయలు మసాలా అనేక తప్పదు. ఎందుకంటే 71 వేల రూపాయల విలువైన హోండా స్కూటీ కి ,తనకు ఇష్టమైన నెంబర్ కోసం ఓ వ్యక్తి 15 లక్షల 41 వేల రూపాయలు వేలంలో పెట్టి ఆ నంబర్ కొన్నాడు. నిజంగా ఇది నమ్మలేము ,కానీ జరిగింది కాబట్టి నమ్మి తీరాల్సిన సత్యం . ఈ సంఘటన చండీగఢ్లో జరిగింది .కార్లకు ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళని చూసాం. అది కూడా పది లక్షల వరకు ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయి.

  అయితే ఈ మహానుభావుడు ఏకంగా 71 వేల రూపాయల హోండా స్కూటీ కి, 15 లక్షల 41 వేల రూపాయలు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఖర్చుపెట్టి రికార్డ్ నెలకొల్పాడు. ఇంతకీ ఆ నంబర్ ఏంటో తెలుసా ..? CH-01-CJ 0001 ఇది ఆ నంబర్. బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి ఆ నంబర్ అంటే తనకు చాలా ఇష్టమని , అదృష్టం కూడా కలిసి వస్తుందని అందుకని ఆ నంబర్ కోసం 15 లక్షల 41 వేల రూపాయలు ఆ నంబర్ కోసం ఖర్చు పెట్టాం అని చెబుతున్నాడు . ఫ్యాన్సీ నెంబర్లు పిచ్చోళ్ళు ఉండబట్టి చండీఘడ్ లో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్యాన్సీ నెంబర్లు వేల వేసి ఒక కోటి యాభై లక్షల రూపాయలు వసూలు చేశారు. రెండో అత్యధిక ఫ్యాన్సీ నెంబర్ గా CH-01-CJ 0001 నంబర్ 5 లక్షల 40 వేల రూపాయలకు పోయింది..

  ఇవీ చదవండి… 

  నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

  ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

  పోలీసులన్నాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా..??

  ఎమ్మెల్యే మేకపాటి తెల్లని బాతు లాంటివారు.. రెండో భార్య శాంత భలేచెప్పింది..