ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

    0
    314

    ప్రియుళ్ళ సాయంతో , భర్తలను చంపే భార్యల ఉదంతాలు కోకొల్లలు.. ఇప్పుడు లేటెస్ట్ గా , ఓ ఇల్లాలు తన ప్రియుడి సాయంతో , మామను హత్యచేయించింది. కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్ జిల్లా , రామనదొడ్డి గ్రామంలో , కాంగ్రెస్ నాయకుడు గంటప్ప హత్య ఇటీవల సంచలనం సృష్టించింది. పోలీసు ఈ హత్య విషయంలో చేసిన దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. కోడలు చైత్ర ఈ హత్యకు కుట్రచేసిందని స్పష్టమైంది. , 28 ఏళ్ళ వయసున్న కోడలు చైత్రకు , నవీన్ అనే వ్యక్తికీ పెళ్ళికి ముందునుంచే సంబంధం ఉంది. పెళ్లి తరువాతకూడా అక్రమసంబందాన్ని అలాగే కొనసాగించింది.

    మామతో ఆస్తి పంపకాల విషయంలో తగాదా వచ్చింది. భర్త , తండ్రిని , ఆస్తి పంచమని గట్టిగా అడగలేకపోవడంతో , మామను చంపి ఆస్తి కాజేయాలని చైత్ర పధకం వేసింది. ప్రియుడు నవీన్ కి డబ్బులిచ్చి , కిరాయి హంతకులని మాట్లాడింది. ఇంట్లో , భర్త లేని సమయం చూసి , మామను కత్తులు , గొడ్డళ్లతో నరికించి చంపించింది. అయితే , బంధువుల అనుమానం వ్యక్తం చేయడంతో , విచారణ చేసిన పోలీసులకు కోడలు చేసిన ఘాతుకం బయటపడింది.. పోలీసులు ఆమెను , ప్రియుణ్ణి , కిరాయి హంతకులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.