ఐదో తరాన్ని కూడా చూడగలిగిన అదృష్టవంతుడు

  0
  145

  కొన్ని కుటుంబాలకు తర తరాల వారసత్వాన్ని చూడడం ఒక వరం.. ఆ అదృష్టం ఒక తరాన్ని చూస్తే సంతోషం రెండో తరాన్ని చూస్తే ఆనందం, మూడో తరాన్నిచూస్తే అమితానందం ,నాలుగో తరాన్ని చూడగలమా అని అడిగితే , చాలా తక్కువ సందర్భాల్లో ప్రపంచంలో కుటుంబంలో నాలుగు తరాన్ని చూడగలరు .. అయితే 1 ,2 ,3 ,4 కాదు ఐదో తరాన్ని కూడా చూడగలిగిన అదృష్టవంతుడు ఉన్నాడు అంటే నిజంగా అతడు భగవత్ ప్రసాదం తో జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి..

  ఓ వ్యక్తి బతికుండగానే ఐదో తరాన్ని చూసుకున్నాడు . తన కొడుకు కొడుకు , ఆ కొడుకు కొడుకు, ఆ కొడుకు కొడుకు, ఆ కొడుకు కొడుకు , ఆ కొకొడుకుకి కొడుకు ఇలా తన వారసుల్లో ఐదో వారసుడిని బతికుండగానే చూసుకోగలిగిన అదృష్టవంతుడు ఈ 112 ఏళ్ల ఈ తాత .. ఈ ఐదో తరం పెద్ద ఇప్పటికీ నడుస్తున్నాడు, ఇంతవరకూ ఈ విషయం మీడియా కు రాలేదు. ఇప్పుడే వచ్చింది . అందుకే ట్రెండింగ్ లో ఉంది చూడండి . తన పని తాను చూసుకో గలిగిన ఈ పెద్దాయన మహా అదృష్టం .

  ఇంతకీ ఈ పెద్దాయన ఆరోగ్య రహస్యం ఏమీ లేదు .. ప్రశాంతంగా జీవనం సాగించడం, వ్యవసాయం చేసుకోవడం ,పండిన పంటను దాచిపెట్టుకుని దాన్ని తినడం ,కుటుంబానికి సరిపోగా మిగిలిన పంటను అమ్మి కుటుంబాన్ని పోషించుకోవడం.. ప్రతిరోజు శారీరక శ్రమతో ఆనందంగా నిద్రపోవడం ,ఇష్టంగా తినడం ,దురలవాట్లు ఏవీ లేకపోవడం ,ఇంత వయసులో కూడా కంటి అద్దాల తో పనిలేదు. పళ్ళు కూడా, ఊడిపోలేదు, కొండ ప్రాంతాలలో స్వచ్ఛమైన గాలి , సెలయేటి నీళ్ళు ఇవే తనను ఆరోగ్యంగా ఉంచుతాయి అని ఈ ఐదో తరం పెద్దాయన చెబుతున్నాడు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..