హానీ ట్రాప్ ట్యూషన్ టీచర్ జీవితం .. ఇలా అంతమైంది…

  0
  320

  పిల్లలకు ట్యూషన్ పేరుతో ఇళ్లలో తిష్ట వేయడం , యజమానికి వలపు వల విసరడం , ఆ తరువాత శృంగారం.. సీక్రెట్ గా వీడియోలు , డైరెక్ట్ గా సెల్ఫీలు .. తరువాత లక్షల రూపాయలకు బ్లాక్ మెయిల్.. ఇలా జరిగిపోయిన ట్యూషన్ టీచరమ్మ కథ చివరకు హత్యతో ముగిసిపోయింది. ఆ యువతి పేరు ప్రియాంక , 29 ఏళ్లు వయసు.. రాజస్థాన్ లోని అంకారా జిల్లాలో కపిల్ గుప్తా అనే సంపన్న వ్యాపారి ఇంట్లో చాలాతెలివిగా , పిల్లలకు ట్యూషన్ చెబుతానని చేరింది.మెల్లగా , ఇంటి యజమాని కపిల్ గుప్తని ప్రేమపేరుతో ఆకట్టుకుంది. అతడి భార్యకు తెలియకుండా అతన్ని బయటకు తీసుకుపోయేది.

  ఇద్దరిమధ్య హోటల్ గదిలో, తన ఇంట్లో జరిగే రాసక్రీడలను వీడియో తీసేది. చిన్నగా అసలు విషయం కపిల్ గుప్తా దగ్గర బయటపెట్టింది. తన తల్లి తనకు పెళ్ళిచేయాలని ఉందని , 50 లక్షలు రూపాయలు కట్నం ఇవ్వాలని , అందువల్ల తనకు డబ్బు సర్దుబాటు చెయ్యాలని కోరింది. అయితే అంత డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో వీడియోలు , ఫొటోలు చూపి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది. తనకు డబ్బులు ఇవ్వకపోతే అప్పటి వరకు తాము ఇద్దరం కలిసి ఉన్న వీడియోలను ఫోటోలను పోలీసులకు ఇస్తానని బెదిరించింది. అతని భార్యకు పిల్లలకు బంధువులు కూడా పంపిస్తాను అని బెదిరించింది. అయితే దీంతో తాను చేసిన పొరపాటును తన భార్యకు చెప్పేసాడు .

  ఆమె తాను ఇద్దరూ రహస్యంగా తీసుకున్న వీడియోలు ఫోటోలు చూపించి , డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తోందని , డబ్బులు ఇవ్వకపోతే వాటిని బయటపెడతానని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పాడు. దీంతో అతని భార్య బావమరిది మరో ఇద్దరు బంధువులు ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి ప్రియాంక ని చంపేశారు . చంపేసి శవాన్ని ఒక వంతెన కింద దాచేశారు . వారం రోజుల తర్వాత ప్రియాంక బయటపడటంతో పోలీసులు జరిపిన విచారణలో తీగ లాగితే డొంక కదిలినట్లు వ్యవహారం అంతా బయట పడింది .

  గతంలో కూడా ప్రియాంక ఇలా ఎనిమిది సందర్భాల్లో పిల్లలకు ట్యూషన్లకు పేరుతో , ఇళ్లలో చేరడం , యజమానులు లోబరుచుకోవడం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే అలవాటు తేలింది. ఇప్పటివరకు ఎనిమిదిమంది మందిని ఇలా బెదిరించిందని తేలింది. చివరకు ఆమె జీవితం ఇలా హత్యతో అంతమైంది. పోలీసులు కపిల్ గుప్తాను , ఆయన భార్యను , బంధువులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..