అమెరికా సైన్యంలో బొట్టుపెట్టుకునేందుకు గ్రీన్ సిగ్నల్.

  0
  41

  అమెరికా సైన్యంలో ప‌ని చేస్తోన్న ఓ భార‌తీయ సైనికుడి సుదీర్ఘ పోరాటం ఫ‌లించింది. త‌న మ‌తాచారం ప్ర‌కారం త‌న‌కు నుదుట బొట్టు పెట్టుకునే అవ‌కాశం క‌ల్పించాలంటూ ద‌ర్శ‌న్ షా అనే సైనికుడు అమెరిక‌న్ మిల‌ట‌రీ అధికారుల‌కు పెట్టుకున్న పిటీష‌న్ ను ఆమోదించి, విధుల్లో ఉండ‌గా అత‌న్ని బొట్టు పెట్టుకునేందుకు అనుమ‌తించారు.

  అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ద‌ర్శ‌న్ షా ఎయిర్ మ్యాన్‌గా ప‌ని చేస్తున్నాడు. సాధార‌ణంగా మ‌త ప‌ర‌మైన వేష‌ధార‌ణ‌కు అమెరికా సైన్యంలో అవ‌కాశం లేదు. అయితే రెండేళ్ళ క్రితం డ్యూటీలో చేరిన ద‌ర్శ‌న్ షా అప్పుడే నుదుట బొట్టు పెట్టుకునే అవ‌కాశం క‌ల్పించాలంటూ అధికారుల‌ను కోరాడు.

  ఎయిర్ ఫోర్స్ లో అందులోనూ అమెరిక‌న్ ఎయిర్ ఫోర్స్ లో ఇలాంటి అనుమ‌తులు రావ‌డం చాలా క‌ష్టం. ద‌ర్శ‌న్ షా సాధించిన ఈ అనుమ‌తి ప‌ట్ల ఆయ‌న స్నేహితులు, బంధువులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ మెసేజ్‌లు పెట్టారు. గుజ‌రాతీ కుటుంబానికి చెందిన ద‌ర్శ‌న్ షా కుటుంబం అమెరికాలో స్థిర‌ప‌డింది. 2020లో మిల‌ట‌రీ దేశీ ట్రైనింగ్ నుంచి అత‌ను యూనిఫాం వేసుకుంటున్న‌ప్పుడు త‌న‌కు బొట్టు పెట్టుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ వ‌చ్చాడు. చివ‌ర‌కు విజ‌యం సాధించాడు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..