మహేష్ బాబుని పాన్ మసాలా భరించగలదా ..?

  0
  230

  బాలీవుడ్‌పై టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. బాలీ వుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ తనను బాలీవుడ్ ప్రొడ్యూసర్లు భరించలేరని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొందరు నెటిజన్స్ మ‌హేష్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

  పాన్ మ‌సాలాలు మాత్ర‌మే నిన్ను భ‌రిస్తాయి. హిందీ సినిమాలు భ‌రించ‌లేవు అంటూ పోస్టులు పెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. గ‌తంలో కొంత‌మంది బాలీవుడ్ హీరోలు పాన్ మ‌సాలా యాడ్స్ లో న‌టించారు. అయితే ఆ త‌ర్వాత ఆ యాడ్స్ నుండి త‌ప్పుకున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా కొన‌సాగుతున్నారు. అందువ‌ల్ల హిందీ సినిమాలు మిమ్మ‌ల్ని భ‌రించ‌లేవంటూ ట్రోల్ చేస్తున్నారు.

  దీంతో మహేష్ మరోసారి బాలీవుడ్‌పై త‌న కామెంట్ల‌పై వివరణ ఇచ్చాడు. బాలీవుడ్‌తో పాటు అన్ని భాష‌ల‌ను తాను గౌర‌విస్తాన‌ని చెప్పాడు. తెలుగు సినిమాలే త‌న‌కు సౌక‌ర్యంగా ఉంటాయ‌న్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరిన‌ప్పుడు .. తాను మ‌రో భాష‌లో సినిమా చేయాల్సిన అవ‌స‌రం ఏముందన్నారు.

  తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి చేరువ కావాల‌న్న క‌ల ఇప్పుడు రిలీజ్ అవుతున్న చిత్రాల‌తో నెర‌వేరింద‌ని చెప్పుకొచ్చాడు మ‌హేష్ బాబు. ఇక మ‌హేష్ ఇచ్చిన వివ‌ర‌ణ‌తోనైనా నెటిజ‌న్స్ ట్రోలింగ్ ఆపుతారో… ఇంకా కంటిన్యూ చేస్తారో చూడాలి.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.