ఆయనకిద్దరు.. అలా పరిచయమయ్యారు.

  0
  785

  ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ప్రేమికుడికి భార్యగా మారే అవకాశాన్ని లాటరీ ద్వారా నిర్ణయించారు పెద్దలు. ఫేస్ బుక్ తో మొదలైన ఈ ప్రేమ చివరకు లాటరీ ద్వారా పెళ్లి పీటలెక్కింది. ఓ అమ్మాయి భార్య కాగా, మరో అమ్మాయి మాజీ ప్రియురాలిగా మిగిలిపోయింది. ఈ ఘటన కర్నాటకలోని సక్లేస్ పుర లో జరిగింది.

  ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలోని ట్విస్టులు సినిమాల్లో కూడా చూసుండరేమో. కొద్ది నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ కథకు లాటరీ పద్ధతి శుభం కార్డు పడేలా చేసింది. ఈ వింత ఘటన కర్నాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సక్లేస్ పుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. ఫేస్ బుక్ లో వారి ప్రేమాయణం మొదలై ముదిరిపోయింది.

  చివరికి ఈ ట్రయాంగిల్‌ స్టోరీ ఆ యువతులకు తెలిసినా అతడినే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ కాస్త పెద్దలకు ముందుకు వెళ్లింది. పంచాయితీలోనూ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇదే సమయంలో ఓ యువతి.. అతడు లేని జీవితం తనకు వద్దని విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు సకాలంలో స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. చికిత్స అనంతరం కోలుకుని ఆమె ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చింది.

  దీంతో తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై పంచాయతీ జరగగా, గ్రామస్థులు ఓ పరిష్కారాన్ని సూచిస్తూ.. లాటరీ పద్ధతి ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇద్దరూ ఓకే చెప్పడంతో లాటరీ తీయగా, విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. దీంతో అదే రోజు అమెతో వివాహం జరిపించారు. రెండో అమ్మాయి మాత్రం కొత్త జంటుకు శుభాకాంక్షలు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ.. నన్ను మోసం చేసిన నిన్ను వదిలిపెట్టను అంటూ పెళ్లి కొడుక్కి వార్నింగ్ ఇచ్చి వెళ్లడం విశేషం.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్