వీడికేమైంది..? మొబైల్ ఫోన్ మింగేశాడు..

    0
    681

    ఒక వ్యక్తి తన వద్ద ఉన్న పాత నోకియా 33310 ఫోన్ ను మింగేశాడు. మామూలుగా 33310 ఫోన్ చాలా పెద్దదిగా ఓ చిన్న ఇటుకరాయి పరిమాణంలో నాలుగో వంతు ఉంటుంది. అయితే 33 ఏళ్ల ప్రిస్టినా అనే వ్యక్తి ఈ పాత ఫోన్ ను మింగేశాడు. 2000 సంవత్సరం మోడల్ ఈ ఫోన్ ని అతనింకా వాడుతూనే ఉన్నాడు. మొబైల్ ఫోన్ ని మింగేసిన తర్వాత అతడికి కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు.

    స్కానింగ్, ఎక్స్ రే చేసి, కడుపులో మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. మరో 24గంటలు దాటి ఉంటే, బ్యాటరీలోని హానికర రసాయనాల వల్ల ప్రాణాపాయం సంభవించి ఉండేదని డాక్టర్లు చెప్పారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి కడుపులోని సెల్ ఫోన్ తొలగించారు. ఇంత పెద్ద సెల్ ఫోన్ ని ఎలా మింగావని అడిగితే అతను మౌనంగా ఉన్నాడు. ఐదేళ్ల క్రితం ఇదే విధంగా ఓ 29 ఏళ్ల వ్యక్తి ఫోన్ ని మింగేసి, కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతడికి కూడా ఇలాగే ఆపరేషన్ చేసి మొబైల్ ఫోన్ తీసేశారు.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్