చదువంటే ఆ అమ్మాయికి ప్రాణం..

    0
    72

    చిన్న చినుకు పడిచే చాలు బడికి ఎగ్గొట్టేవారిని చాలామందినే చూస్తుంటాం. కాస్త నలతగా ఉంటే చాలు, అమ్మా జ్వరం అని కాలేజీ ఎగ్గొట్టి క్రికెట్ ఆడుకోడానికి పోయే బ్యాచ్ కూడా ఉంటారు. అలాంటి వారందరూ ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సిందే. చదువంటే ఆమెకి ఎంత ఇష్టమంటే చెప్పనలవి కాదు.

    ఆ అమ్మాయి పేరు సంధ్య సహాని. గోరఖ్ పూర్ ప్రాంతంలోని బరంపూర్ నివాశి. నిన్న మొన్నటి వరకు అక్కడ స్కూల్స్ లేవు, ఆన్ లైన్ క్లాసులున్నా ఆ కుటుంబానికి స్మార్ట్ ఫోన్ లేదు. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో 11వ తరగతి చదువుతున్న సంధ్య స్కూల్ కి వెళ్తోంది. వరదలతో ఆ ప్రాంతమంతా జలమయం అయింది. సంధ్య కుటుంబం ఉంటున్న ప్రాంతం కూడా నీటమునిగింది. అయితే ఆ అమ్మాయి మాత్రం పట్టుదలతో పడవలో స్కూల్ కి వెళ్తోంది. రోజూ పడవలో వెళ్లి పడవలో వస్తోంది. స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో తాను ఆన్ లైన్ క్లాసుల్లో చదువుకోలేనని, అందుకే స్కూల్ కి వెళ్తున్నానంటోంది సంధ్య.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్