మోడల్ గా ఉన్న హిజ్రా ప్రేమ విఫలమై..

  0
  81

  ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు అమ్మాయిలకు , అబ్బాయిలకే కాదు , అటు ఇటు గాని హిజ్రాలకూ ఉంటాయి . హిజ్రాలకు ఒక మనసు ఉంటుంది . ప్రేమలు ఉంటాయి. ఇటీవల ప్రేమ వ్యవహారాల్లో విఫలమై పలువురు హిజ్రాలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి . తాజాగా కేరళ రాష్ట్రంలోని 26 ఏళ్ల మాత్యుస్ అనే హిజ్రా ఆత్మహత్య చేసుకుంది.

  టీవీ సీరియల్స్లో నటిస్తూ ,మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్న మాత్యుస్ ఒక అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది . ఆమె గత కొద్ది కాలంగా కొచ్చిన్ లోని చక్కెర పెరంబుర్ అనే ప్రాంతంలో నివసిస్తోంది . ఆమెకు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని చెబుతారు . ప్రేమలో విఫలమై ఇలా ఆత్మహత్యకు పాల్పడిందన్న అభిప్రాయం ఉంది .

  గత కొంతకాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధ పడుతోందని తెలిసింది . ఇదిలాఉండగా కేరళలోని సహన అనే 21 ఏళ్ల మోడల్ పుట్టినరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది జరిగి వారం కాకముందే ఇప్పుడు మాత్యుస్ చనిపోయింది . గత ఏడాది జూలైలో కేరళ లో మొట్టమొదటి హిజ్రా రేడియో జాకీ కుమారి అలెక్స్ సెక్స్ మార్పిడి ఆపరేషన్ విఫలమై చనిపోయిన సంగతి తెలిసిందే.

   

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..