భార్యకు చీర కట్టడంచేతకాదని భర్త ఆత్మహత్య..

  0
  330

  కొంతమంది భార్య పోరు పడలేక ,ఆత్మహత్యలు చేసుకుంటే , మరి కొంత మంది భార్యల అక్రమ సంబంధాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొంతమంది గయ్యాళి భార్య తో వేగలేక విడాకులు తీసుకుంటే ,ఇంకొంతమంది అమితంగా ప్రేమించిన భార్య తనను వీడి చనిపోతే , ఆ బాధలో ఆత్మహత్యలు చేసుకునే ,నేటి పరిస్థితుల్లో ఓ భర్త విచిత్రమైన వాదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.

  తన భార్యకు చీర కట్టుకోవడం చేతకాదని ,నడవడం ,మాట్లాడడం కూడా చేతకావడం లేదు అని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంత చెప్పినా చీర సరిగా కట్టుకోవడం లేదని , నాజూగ్గా నడవడం లేదని ,మర్యాదగా మాట్లాడడం లేదని తన ఆత్మహత్యకు కారణాలని చెప్పి ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు . మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ముకుందనగర్ లో 24 ఏళ్ల సమండల్ తనకంటే పదేళ్ల పెద్దదైన మహిళను పెళ్లి చేసుకున్నాడు .

  ఆతర్వాత ముకుంద నగర్ లో కాపురం పెట్టాడు . నాలుగు రోజుల క్రితం సమండల్ ఉరి వేసుకుని చనిపోయాడు . పోలీసులు సమండల్ ఇంటిని సోదా చేస్తే అక్కడ ఆత్మహత్య చేసుకునే ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ దొరికింది . దీంట్లో తన భార్య తనకంటే పెద్దదైనప్పటికీ ఇష్టపడి పెళ్లి చేసుకునానని, అయితే తర్వాత ఆమె నడిచే తీరు బాగాలేదని మాట్లాడే పద్ధతి కూడా సక్రమంగా ఉండటం లేదని అన్నిటికంటే మించి చీర కట్టుకోవడం కావడంలేదని అందుకే తాను విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ లేఖలో రాశాడు.

   

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..