రెండేళ్ళ బుడ్డోడు…
అమ్మ ఫోన్ తీసుకుని ఏం ఆర్డర్ ఇచ్చాడో చూడండి ?
=================
ఆటబొమ్మలతో ఆడుకునే పిల్లలను ఇప్పట్లో చూడలేకపోతున్నాం. సెల్ ఫోన్లు, ట్యాబులు ఉంటే చాలు. ఇప్పుడు వాటితోనే ఆడుకుంటున్నారు. కరెక్టుగా చెప్పాలంటే వాటితో ఆటాడేసుకుంటున్నారు. ఈ బుడ్డోడు కూడా అంతే. అమ్మ స్మార్ట్ ఫోన్ తీసుకుని ఏదో చూసుకుంటూ… అందులో ఉండేవన్నీ పరిశీలిస్తూ చూస్తున్నాడు. ఫుడ్ యాప్ కనిపించింది.
డిస్ ప్లేలో కనిపించే ఫుడ్ ఏంటో చూద్దామనుకుని… యాప్ ఓపెన్ చేశాడు. అందులో చకచకా అంటూ టచ్ చేశాడు. కాసేపట్లో ఫుడ్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఆ బుడ్డోడి అమ్మ వచ్చి డోర్ తీయగానే… ఫుడ్ డెలివరీ అంటూ బాయ్ చెప్పడంతో ఖంగుతింది.
ఆ తర్వాత పిల్లాడి చేతిలో ఫోన్ తీసుకుని చూడగానే.. 31 చీజ్ బర్గర్లు ఆర్డర్ ఇచ్చినట్లు కనిపించింది. తెలియకుండా పిల్లాడు చేసిన తుంటరి పనికి మురిసిపోయిన ఆ తల్లి… బర్గర్లకు చెల్లించాల్సిన 62 డాలర్లతో పాటు… కొడుకు చేతితో 16 డాలర్లు టిప్‌గా ఇచ్చి పంపించింది. ఆ చీజ్ బర్గర్ల పక్కన కొడుకుని కూర్చోపెట్టి ఓ ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ పిక్ వైరల్ అయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఘటన జరిగింది.