అడుగడుగన టోల్ ప్లాజా దోపిడీ కి ఇక ఫుల్ స్టాప్ పడనుంది . 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలను మూసివేస్తారు . ఒక టోల్ ప్లాజా నుంచి రెండో టోల్ ప్లాజా మధ్య కనీసం 60 కిలోమీటర్లు దూరం ఉండాలి. 60 కిలోమీటర్ల దూరం కంటే తక్కువ ఉండే టోల్ ప్లాజా లను మూసివేస్తారు. అందువల్ల ఇకనుంచి గంటన్నర వ్యవధిలో ప్రయాణంలో టోల్ ప్లాజా దోపిడీకి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో చెప్పారు .
కేంద్ర ఉపరితల శాఖ నిబంధనల ప్రకారం రెండు టోల్ ప్లాజామధ్య కనీస దూరం 60 కిలోమీటర్ల ఉండాలి. అలా లేని వాటిని మూడు నెలల్లో మూసేస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చారు. చాలా జాతీయ రహదారుల్లో 40 కిలోమీటర్ల కు ఒక టోల్ ప్లాజా ఉంది. కనీసం వంద కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే నాలుగు టోల్ ప్లాజాలు ఉన్న జాతీయ రహదారులు కూడా ఉన్నాయి . ఇక నుంచి అటువంటి జాతీయ రహదారిలో ఉన్న టోల్గేట్ల ఫీజులు బెడద ప్రజలకు ఉండదు. ఇది ఒక రకంగా వాహనదారులకు శుభవార్త..
ఇది కాక కాశ్మీర్ కు దేశంలోని మిగతా ప్రాంతంతో అనుసంధానం చేసే రవాణా ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని గడ్కరీ చెప్పారు . కాశ్మీర్ అంటే ఈ దేశం నుంచి దూరంగా ఉండేది కాదని కాశ్మీర్ కి కూడా గంటల వ్యవధిలో చేరుకునే విధంగా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు ఇందుకోసం మన దేశ సరిహద్దు ప్రాంతమైన కార్గిల్ వరకూ రవాణా సౌకర్యాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇది కాకుండా మానస సరోవరం కైలాస యాత్ర కు చైనా నేపాల్ దేశాల అనుమతి లేకుండా వాళ్ళ భూభాగం నుంచి పోయే వీలులేకుండా మనదేశంలోని ఉత్తరాఖండ్ నుంచి రోడ్లు నిర్మిస్తున్నామని వచ్చే ఏడాది డిసెంబర్ నెలాఖరుకు ఇవి పూర్తవుతాయని అన్నారు..