రెండో భార్య పక్కా ప్లాన్ .. భర్త హతం.

  0
  93

  కర్ణాటక రియల్ ఎస్టేట్ కింగ్ రాజమల్లప్ప హత్యకేసులో రెండు భార్య కిరణ ప్రమేయం ఉందని తేలింది. భర్త , వ్యాపార బాగస్తులు మరో ఇద్దరితో , ఆమె లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకొని , హత్యకు ప్లాన్ చేసి చంపించింది. బెళగావికి చెందిన రాజుకి , ముగ్గురు భార్యలు. 22 ఏళ్ళ క్రితం ఉమా అనే మహిళను పెళ్లిచేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు బిడ్డలు.. ఇద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. ఆమె బెంగుళూరులో ఉంటుంది.

  తరువాత ఎనిమిదేళ్ల క్రితం , మహారాష్ట్రలోని లాతూర్ కి చెందిన కిరణ తో , ప్రేమలో పడ్డాడు. తరువాత ఆమెనుకూడా పెళ్లాడాడు. ఆమెకుకూడా ఇద్దరు పిల్లలు. మళ్ళీ ఏడాదిక్రితం హలియాల్ కి చెందిన దీపాలీ తో , ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నాడు. ఆమె ఇప్పుడు గర్భవతి. ముగ్గురు భార్యలకు మూడు ఇళ్ళు కట్టించి విడిగానే కాపురాలు పెట్టాడు. అయితే ఆస్తుల విషయంలో గొడవలు రావడంతో , రెండో భార్య కిరణ , భర్తను చంపేందుకు , అతడి బాగస్తులతో కలిసి కుట్ర చేసింది.

  మూడో భార్య హాస్పిటల్లో ఉండగా , ఆమెను చూసేందుకు , కారులో ఇక్కడే పోతుండగా , కిరాయి హంతకులు దాడిచేసి , రాజుని చంపేశారు. వీళ్లకు 10 లక్షల రూపాయలు సుపారికూడా ఆమె ఇచ్చింది. హత్య తరువాత , బాగస్తులు , రాజు భార్యల కాల్ డేటా పరిశీలించిన పోలీసులకు , కుట్రలో ఎవరున్నారన్న విషయం తెలిసి పోయింది..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..