సిమ్లాలో కారుకి అడ్డం వచ్చిన కోతిని రక్షించబోయి ఆ కారు దారుణ ప్రమాదానికి గురైంది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో యాత్రికుల బృందం బ్రిడ్జిపై కారులో పోతుండగా, ఓ కోతి అడ్డం వచ్చింది. కోతిని తప్పించబోయి కారు మీద కంట్రోల్ కోల్పోయిన డ్రైవర్, బ్రిడ్జి పైనుంచి కారుతో సహా కిందపడ్డాడు. ఆ సమయంలో కారులో నలుగురు కుటుంబ సభ్యులున్నారు. అదృష్టవశాత్తు, అక్కడున్న స్థానికులు వెంటనే కారుని యథాప్రకారం నిలిపి ఉంచి కారులోనివారిని రక్షించారు. కారులో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. స్వల్ప గాయాలు తప్ప, ఎవరికీ పెద్ద ప్రమాదం లేదు. ఈ బ్రిడ్జిపై నిరంతరం కోతులు తిరుగుతూనే ఉంటాయి. ఆ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ఓసారి మీరూ చూడండి.
car skids off an elevated road and comes crashing down into a parking lot below in dramatic visuals that have emerged from Shimla in Himachal Pradesh. This happened after a monkey came in front of the vehicle and the driver lost control in an attempt to save the animal's life. pic.twitter.com/deywh9B6Q0
— Mohammad Ghazali (@ghazalimohammad) November 21, 2021