మా కుటుంబాన్ని క్షోభపెట్టారు.. అనుభవించండి

    0
    763

    తనను తన కుటుంబాన్ని చిత్ర హింసలు పెట్టి మానసిక క్షోభకు గురి చేసిన చంద్రబాబు నాయుడికి తగిన శాస్తి జరిగిందని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈమేరకు ఆయన చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాశారు. తనను, తన కుటుంబంలోని మహిళలను, చివరకు చిన్న బిడ్డలను కూడా జైలు లాంటి ఓ ఆస్పత్రి గదిలో బంధించి స్నానం చేయడానికి కానీ, బట్టలు మార్చుకోడానికి కానీ వీలు లేకుండా మరొక ఆరుగురు పోలీసుల్ని అదే గదిలో పెట్టి మానసికంగానూ, శారీరకంగానూ చిత్ర హింసలు పెట్టిన చంద్రబాబుకి ఇలాంటి గతి పట్టడం చూడాలనే బహుశా తాను ఆ రోజు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని ముద్రగడ అన్నారు. 13 రోజులు ఒక చిన్న గదిలో తమని బంధించి, మరో ఆరుగురు పోలీసుల్ని అదే గదిలో ఉంచి, ప్రతి రోజూ తమ ఫొటోలు తీసి పంపించాలని చెప్పడం చంద్రబాబు రాక్షసానందానికి నిదర్శనం అని అన్నారు. ఈ అవమానాలు భరించలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, 4 సంవత్సరాల మనవరాలు అప్పుడప్పుడు అర్థరాత్రులు లేచి, భయపడేదని తాము పడిన బాధలు చెప్పేందుకు మాటలు కూడా చాలవని అన్నారు.

    ఈ చిత్రహింసలతో తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నం అని ఆయన, ప్రయత్నం మేరకే తాను కూడా అలాంటి ఆలోచన చేశానని, అయితే తనను, తన కుటుంబాన్ని దారుణంగా అవమానపరచిన చంద్రబాబు పతనం కళ్లారా చూడాలని, ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నానని అన్నారు. అనుకూల మీడియా ఉంది కాబట్టి, ఆ మీడియా ద్వారా సానుభూతి సంపాదించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆ రోజు తనకోసం మీడియానే కట్టడి చేశారని, తనను అనాథను చేసి తన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారని అన్నారు.

    తన ఇంటి వద్ద డ్రోన్ కెమెరాలతో నిత్యం నిఘా పెట్టించి, భయంకరమైన వాతావరణం సృష్టించి 6వేలమంది పోలీసుల్ని తమ గ్రామంలో పెట్టి మహిళలను కూడా నీఛంగా మాట్లాడించిన చంద్రబాబు నాయుడికి ఈరోజు కన్నీళ్లెలా వస్తాయని అన్నారు. చివరకు తన గదిలో డబ్బులు, సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారని, చంద్రబాబు నాయుడు శ్రీమతిని అవమానించేందుకు ఈ లేఖ రాయడంలేదని, ఆయన తమ కుటుంబానికి చేసిన చిత్ర హింసను ఒక్కసారి గుర్తు చేయాలని లేఖ రాస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు తనకు ఒకప్పుడు మిత్రుడని, అయితే తనను ఉక్కు పాదాలతో అణచివేయడంలో నీఛంగా ప్రవర్తించాడని అన్నారు. చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి కన్నీరు కార్చడం టీవీలో చూసి ఆశ్చర్యపోయానని, ఆయన కుటుంబానికన్నా, తన కుటుంబానికే ఘన చరిత్ర ఉందని, ఇండిపెండెంట్ గా అనేకసార్లు గెలిచిన ఘనత తమదని చెప్పారు. ఇలా రాసుకుంటూ పోతే పేజీలు కూడ సరిపోవని, అందువల్ల చంద్రబాబు శపథాలు చేసేంత పెద్ద నాయకుడు కాదని, శపథాలు చేయడం, వాటిని సాధించుకోవడం.. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతం అని గ్రహించాలని అన్నారు.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.