పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్.. ఇటీవల ఓ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. బీచ్ వద్ద దిగిన ఆ ఫొటోలను ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. లోక్ సభకు ఎన్నికైన తర్వాత కూడా తన ఫొటోషూట్లను ఆపలేదు నుస్రత్. ఆమె తన సినిమా వ్యవహారాలను, ఇతర ఫంక్షన్లు, ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.
నుస్రత్ జహాన్ 2010లో ఫెయిర్ వన్ మిస్ కోల్‌కతా పోటీలో గెలుపొందిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు. 2011లో షోత్రు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ టికెట్ పై ఆమె గెలుపొందారు. ఎంపీగా లోక్ సభలో అడుగు పెట్టారు.
నుస్రత్ జహాన్ వైవాహిక జీవితంపై ఆమధ్య పుకార్లు షికార్లు చేశాయి. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు కూడా. అయితే ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం నుస్రత్ జహాన్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.